Suryaa.co.in

Andhra Pradesh

సాక్షి ఛానెల్‍లో అనుచిత వ్యాఖ్యలపై ఏపీ అండ్ టీజీ ఎంఎస్‍వో ఫెడరేషన్ ఆగ్రహం

సాక్షి ఛానెల్‍లో ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ అండ్ టీజీ ఎంఎస్‍వో ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది.

కృష్ణంరాజు, కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని ఏపీ అండ్ టీజీ ఎంఎస్‍వో ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను తెలుగు మహిళలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ఫెడరేషన్ పేర్కొంది. అమరావతి మహిళలకు తమ సంఘీభావం ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెప్పింది. ఏ చర్చ అయినా, ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా జరగాలని ఛానెళ్లకు ఏపీ అండ్ టీజీ ఎంఎస్‍వో ఫెడరేషన్ హితవు పలికింది.

LEAVE A RESPONSE