Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా సీబీఐ విచారణ జరగాలి

-వైయస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి
-హత్య జరిగిన ముందు, తరువాతి రోజుల్లో కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేయాలి
-వైయస్‌ వివేకా హత్య కేసులో ఏబీఎన్‌ రాధాకృష్ణ, బీఆర్‌నాయుడునూ విచారించాలి 
-ఎన్టీఆర్‌ వారసులు టీడీపీలోకి వస్తుంటే ఎందుకు యాక్సిడెంట్లు, గుండెపోట్లు వస్తున్నాయి..?
-ఎన్టీఆర్‌ మరణంపై గుట్టు విప్పాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తా..
-నీ బాబాయ్‌ రామ్మూర్తినాయుడు ఎక్కడున్నాడు లోకేష్‌
-నారావారిపల్లె సంక్రాంతి వేడుకలో నీ బాబాయ్‌ ఎందుకు కనిపించలేదు
-సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో లోకేష్‌
-వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్‌

జూమ్‌ మీటింగ్‌లో మమ్మల్ని చూసి తెల్లమొహం వేసి గుటకలు మింగుతూ పారిపోయిన చవట దద్దమ్మ లోకేష్‌.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. పాదయాత్ర చేయడం కంటే ఫుల్‌గా తిని ప్రశాంత్‌ అత్తగా (ప్రశాంతత) పడుకోవడం పప్పుగుత్తి లోకేష్‌కు ఇష్టమని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో నడవ లేక లోకేష్‌కు తొడలు రుద్దుకుపోతున్నాయంట. పది కిలోమీటర్ల నడవడానికి కూడా లోకేష్‌కు 20 సార్లు ఆయిల్‌ రాయాలంట. తొడల మంటకు నోరుతిరగని మూతి వేసుకొని చంద్రబాబును మీదున్న కోపాన్ని సీఎం మీద చూపిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఏం మాట్లాడారంటే..

చంద్రబాబును ముసలోడు అంటే పప్పుగుత్తి లోకేష్‌ ఊరుకోడంట. చంద్రబాబు ముసలోడు కాబట్టే నువ్వు పనికిమాలిన పప్పు అని తెలిసినా, మంగళగిరిలో గెలవలేని చవట దద్దమ్మ అని తెలిసినా, దిక్కులేక, గతిలేక పాదయాత్రకు పంపించాడు. నీకు మాట్లాడటం రాదు, నోరు తిరగదు, తినడానికి తప్ప ఆ నోరు దేనికి పనికిరాదు. పాదయాత్రలో లోకేష్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. నీలాంటి కొడుకు పగవాడికి కూడా వద్దని ప్రార్థనలు చేసుకుంటారు. పప్పుగుత్తి లోకేష్‌ కుప్పంలో బహిరంగ సభ పెట్టి ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పాడు. బహిరంగ సభలు ఖాళీ గ్రౌండ్‌లో పెట్టుకోమంటే.. ఇరుకు సందుల్లోకి వెళ్లి డబ్బులిచ్చి జనాన్ని తరలించి బిల్డింగ్‌లు ఎక్కి స్పీచ్‌లు ఇస్తున్నాడు. పోలీసులను తిడుతున్నాడు. నీ పప్పు గుత్తిని పట్టుకోవడానికి ముఖ్యమంత్రి రావాలా..? నీలాంటి ఛీటర్లను కంట్రోల్‌ చేయడానికి పోలీస్‌ వ్యవస్థ ఉంది.

వలసలు వెళ్లిపోతున్నారంట..
నారావారిపల్లె నుంచి వలస వెళ్లిన వెధవలు చంద్రబాబు, లోకేష్‌. సంక్రాంతి పండగకు బంధువులందరినీ పోగేసుకెళ్లి పండగ చేసుకోవడం తప్ప.. మీ ముఖాలకు ఊర్లో ఎప్పుడైనా ఉన్నారా..? మీ దత్తపుత్రుడూ అంతే. ఏపీకి వచ్చినప్పుడల్లా ఇక్కడే పుట్టా, చదివా, పెరిగా అని చెబుతుంటాడు. హైదరాబాద్‌కు వలసపోయాడు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ హైదరాబాద్‌కు వలసపోయారు. అప్పుడు ముఖ్యమంత్రే పంపించాడా..? నీ అయ్యను చంద్రగిరి నుంచి కుప్పానికి ఎవరు వలస పంపించారు.. మీ దత్తపుత్రుడిని భీమవరం, గాజువాక ఎవరు వలస పంపించారు.. అడ్రస్‌ లేని పప్పుగుత్తిగాడిని మంగళగిరి ఎవరు వలస పంపించారు. వలస వెళ్లిపోయి హైదరాబాద్‌లో ఉండి.. టూరిస్టుల్లా ఇక్కడకు వచ్చి, నోటికి ఇష్టం వచ్చినట్టుగా వాగే వ్యక్తులు చంద్రబాబు, పవన్, పనికిమాలిన పప్పుగుత్తి లోకేష్‌.

వైయస్‌ వివేకా హత్య గురించి మాట్లాడుతున్నాడు.. మరి నీ బాబాయ్‌ రామ్మూర్తినాయుడిని మీడియా ముందుకు తీసుకురా.. నీ బాబాయ్‌ని ఎక్కడ దాచారు. ఖర్జూరనాయుడు రెండో కొడుకు రామ్మూర్తి నాయుడిని మీడియాకు చూపించు. నీ బాబాయ్‌ ఎక్కడున్నాడో, ఎక్కడ దాచారో, నీ అయ్య దెబ్బకు ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియనివ్వరు. రామ్మూర్తినాయుడు ఉన్నాడా..? ఉంటే ఎక్కడున్నాడు. కాంగ్రెస్‌పార్టీలో చేరి చంద్రబాబును బూతులు తిట్టిన తరువాత రామ్మూర్తినాయుడు ఏమయ్యాడు..? బతికే ఉన్నాడా..? ఎక్కడైనా కనిపిస్తున్నాడా..? సంక్రాంతి పండగకు నారావారిపల్లెలో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎందుకు కనిపించడం లేదు.

వైయస్‌ వివేకానందరెడ్డి కేసుపై సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే హత్యకాబడ్డారో..ఆ కుటుంబ సభ్యులు వారికి ఉన్న అనుమానాలను సీబీఐ ముందు చెప్పారు. సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మా ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఫోన్‌ సంభాషణలో ఉన్నవారిని విచారణకు పిలిస్తే ముద్దాయిలు అంటూ చవట దద్దమ్మ చంద్రబాబు, పప్పుగుత్తిలోకేష్, ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఆ కేసులో సీఎం వైయస్‌ జగన్‌ సతీమణిని ఇన్వాల్వ్‌ చేస్తున్నారు. అదే చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే ఏడుస్తారు. అసెంబ్లీలో ఏమీ అనకుండానే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు.

సీఎం వైయస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లిన తరువాత మేము మాట్లాడాలంటే ఓఎస్‌డీ కృష్ణమోహన్, సహాయకుడిగా పనిచేసే నవీన్‌తో, కేఎన్‌ఆర్‌తో మాట్లాడుతాం. సీఎం వైయస్‌ జగన్‌తో మాట్లాడాలంటే ఇంట్లో ఉంటే నవీన్‌కు ఫోన్‌చేస్తాం.. ఆఫీస్‌లో ఉంటే ఓఎస్‌డీకి, కేఎన్‌ఆర్‌కు చేస్తాం. అందుబాటులో ఉన్నవారికి ఫోన్‌చేసి సమాచారం ఇస్తాం. దాంట్లో తప్పు ఏముంది..? వీరికి వచ్చిన ఇబ్బంది ఏంటీ..?

వివేకానందరెడ్డి చనిపోయిన తరువాత ఆ సమాచారాన్ని చేరవేయడానికి ఫోన్‌ చేస్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌నాయుడు, రామోజీరావు, ముసలినక్క చంద్రబాబుకు, పప్పుగుత్తి లోకేష్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటీ..? వివేకానందరెడ్డి చనిపోయిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు. ఆరోజు చంద్రబాబుతో కడప జిల్లా వారు ఎవరెవరు మాట్లాడారు. ఇంటెలిజెన్స్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు–చంద్రబాబు ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారు. ఆ జిల్లా టీడీపీ నేలతో చంద్రబాబు ఏం మాట్లాడారు.. దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలి.

హత్య జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముద్దాయిలను ఎందుకు పట్టుకోలేకపోయాడు.. హత్యలో బాబుకు ప్రమేయం ఉందా..? ఎందుకు చార్జ్‌షీట్‌ వేయలేకపోయారు..? రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని ఎందుకు బ్యాన్‌ చేశారు..? హత్యా రాజకీయం బయటపడుతుందని బ్యాన్‌ చేశారా..? ఈ అంశాలన్నింటిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. దీనికి ఏబీఎన్‌ రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, ఈటీవీకి వీటన్నింటిలో గతంలో, ప్రస్తుతం ప్రమేయం ఉంది.. సీబీఐలో ఏం జరుగుతుందో ఈ ముగ్గురు ముందే ఎలా చెబుతున్నారు..? చంద్రబాబు ఫోన్‌ కాల్స్, ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్‌ కాల్స్, గత డీజీపీ ఫోన్‌కాల్స్, ఎస్పీ, కడప జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్‌ కాల్స్, లోకేష్‌ ఫోన్‌ కాల్స్‌ హత్య జరిగిన తరువాత రోజులు, ముందు రోజుల కాల్‌ డేటా ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నా అని కొడాలి నాని అన్నారు.

ఎన్టీఆర్‌ మరణం తరువాత నందమూరి కుటుంబం రోడ్డునపడింది. ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ మృతిపై సీబీఐ విచారణ జరపాలని హరకృష్ణ కోరితే ఎందుకు విచారణ జరపించలేదు. ఎన్టీఆర్‌ మృతదేహానికి ఎందుకు పోస్ట్‌మార్టం చేయించలేదు. ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు. హరికృష్ణను పార్టీ నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడు చంద్రబాబు. పిచ్చి పిచ్చిగా వాగితే బాబు చరిత్రంతా బయటకు తీస్తా. ఎన్టీఆర్‌ మరణంపై గుట్టు విప్పాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తా. అపాయింట్‌మెంట్‌ ఇస్తే ప్రధాని మోదీ, అమిత్‌షా, సీఎం వైయస్‌ జగన్, కేసీఆర్‌లను కలుస్తా. ఎన్టీఆర్‌ మరణం ఈరోజుకీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్‌ ఈ రాష్ట్ర సంపద.. ఆయన మరణానికి కారణం తెలియాలి. ఎన్టీఆర్‌ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే యాక్సిడెంట్లు, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతున్నారు.

LEAVE A RESPONSE