Suryaa.co.in

Telangana

రేవంత్ పై క్రిమినల్ కేసు బుక్ చేయాలి

హామీల అమలుకు డబ్బు లేదు కానీ మూసి పేరు తో లక్షా 25 వేల కోట్ల దోపిడీ చేస్తారా ?
50 లక్షల రూపాయల లంచం ఇస్తూ పట్టుబడ్డ రేవంత్ మాట్లాడటమా ?
బండి సంజయ్ సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారు
హరీష్ రావు వెనకాల రేవంత్ఓ కార్యకర్తగా ఉన్నారు
రేవంత్ యనమల చెప్పులు తాకుతున్న ఫోటో లోకమంతా చూసింది
ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని నెలలుగా అసహనం తో వ్యవహరిస్తున్నారు. రేవంతే అనుకోలేదు తాను సీఎం అవుతాననీ ..ఎలాగూ సీఎం అయ్యేది లేదని ఇబ్బడి ముబ్బడి గా ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మహిళలకు 2500 రూపాయలు ,నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ,ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు ,రైతు భరోసా 15 వేలు ,తులం బంగారు ,2 లక్షల రుణమాఫీ ఇలా అనేక హామీలు ఇచ్చారు.

ఈ హామీలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారు.m రేవంత్ కూడాకాంగ్రెస్ గెలిచినందుకు ఆశ్చర్య పోయారు. హామీలు అమలు కానందుకు రేవంత్ ,కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో అసహ్యం పుట్టింది. రేవంత్ కనబడగానే టీవీ లు కట్టేసే పరిస్థితి వచ్చింది. ఇక కాంగ్రెస్ జన్మ లో రాష్ట్రం లో బతికి బట్టగట్టే పరిస్థితి లేదు.

రేవంత్ కు కూడా తాను సీఎం గా ఎంత కాలం ఉంటాడో తెలియదు. ఉన్నన్ని రోజుల్లో ఇల్లు చక్కబెట్టుకోవాలని సీఎం ధన దాహం ప్రదర్శిస్తున్నారు. పదవి కాపాడుకోవటానికి దోపిడి చేస్తూ ఢిల్లీ కి డబ్బులు పంపుతున్నారు.హామీలకు డబ్బులు లేవు కానీ లక్షా 50 వేల కోట్లు మూసి కి ఎక్కడివి ?

కే టీ ఆర్ ఈ ప్రశ్న లేవనెత్తేసరికి రేవంత్ అసహనం తో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఈ ఖరీఫ్ కు రైతు భరోసా లేదని మంత్రి తుమ్మల రేవంత్ మాటగా చెప్పేశారు. రైతుల నోట్లో రేవంత్ మట్టి కొట్టారు. రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేపు బీ ఆర్ ఎస్ అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపు ఇచ్చింది. రైతులు రేపటి దాకా ఆగడం లేదు ..ఈ రోజే ధర్నాలు మొదలు పెట్టారు.

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేటా ముంచింది. వచ్చే డిసెంబర్ 9 సోనియా పుట్టిన రోజు సందర్బంగా మొత్తం రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి తుమ్మల మళ్ళీ మాట మార్చారు. కేవలం 2500 కోట్లే వేస్తామని తుమ్మల చెబుతున్నారు .రైతులను మోసం చేశారు. అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టి ఇపుడు సన్న వడ్లకే అంటున్నారు.

దొడ్డు వడ్లను రైతులు 2100 రూపాయలకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పుటికీ చాలా చోట్ల తెరవలేదు. కింది స్థాయిలో అంతా గందర గోళం ఉంది. అన్ని రకాల వడ్లను 2800 రూపాయలకు కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు 26 క్వింటాల్ ల ధాన్యానికి 2800 చొప్పున చెల్లించాలి. సన్న ధాన్యం కొనుగోలుకు ఇంకా విధి విధానాలు సరిగా రూపొందించలేదు.

రైస్ మిల్లుల అలాట్ మెంట్ కూడా పూర్తి కాలేదు. ఏర్పాట్లు సరిగా చేయక రైతులు ప్రైవేట్ వారికి అమ్ముకోవాలని. ప్రభుత్వం దురుద్దేశం తో వ్యవహరిస్తోంది. మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి. మాకు జిల్లాల నుంచి రైతులు పిర్యాదు చేస్తున్నారు.

ముక్కలకు కూడా బోనస్ చెల్లించాలి. ముక్కలను 500 బోనస్ కలిపి 2750 రూపాయలకు కొనుగోలు చేయాలి. సోయాబీన్ రైతు ప్రతి క్వింటాల్ కు 1100 రూపాయలు నష్టపోతున్నారు. సోయాబీన్ కు కూడా 500 బోనస్ చెల్లించాలి. బోనస్ తో కలిపి 5370 రుపాయలకి కొనుగోలు చేయాలి.

రేవంత్ కు ఇలాంటి సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. మేము ప్రశ్నించే సరికి ఆయనకు అసహనం వస్తోంది. 25 వేల కోట్లతో పూర్తయ్యే మూసి పునరుజ్జీవం కోసం రేవంత్ లక్షా 50 వేల కోట్లు వెచ్చిస్తున్నాడు. ఇవన్నీ అడిగితే రేవంత్ కే టీ ఆర్ ,హరీష్ రావు లపై ఇష్టమొచ్చినట్టు అరుస్తున్నారు. రేవంత్ రాజీవ్ సద్భావన సభ లో సంస్కార హీనంగా మాట్లాడారు.

నాడు రాజీవ్ గాంధీ బాయి బాయి అంటే రేవంత్ భౌ భౌ అని అరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో బుల్డోజర్లు నడిపించి మా కే టీ ఆర్- హరీష్ రావు లను చంపుతా అని రేవంత్ అంటున్నారు. ఇది సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష నేనా ? నేను డీజీపీ ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే సీఎం రేవంత్ పై క్రిమినల్ కేసు బుక్ చేయాలి. సీఎం పదవి లో ఉంటూ నిజనిర్ధారణ కమిటీ వేస్తా అంటున్నారా? నిజనిర్ధారణ కమిటీలు పౌర సమాజం వేస్తుంది .సీఎం కాదు .ఇది తెలియని వాడు సీఎం అయ్యాడు.

చట్ట ప్రకారం ఫార్మ్ హౌజ్ ల పై చర్యలు తీసుకో ఎవరు వద్దన్నారు? మీ మంత్రుల ఫార్మ్ హౌజ్ లు కూడా ఉన్నాయి. వాటి పై చర్యలు తీసుకో. క్యారెక్టర్ గురించి నగ్నంగా 50 లక్షల రూపాయల లంచం ఇస్తూ పట్టుబడ్డ రేవంత్ మాట్లాడటమా ? మూసి పేరు తో జరిగే దోపిడి పై ప్రజలు కచ్చితంగా తిరగబడుతారు. హామీల అమలుకు డబ్బు లేదు కానీ మూసి పేరు తో లక్షా 25 వేల కోట్ల దోపిడీ చేస్తారా ?

రైతు రుణ మాఫీ అయ్యేదాకా రైతు భరోసా ఇచ్చే దాకా బీ ఆర్ ఎస్ సీఎం రేవంత్ ను వదిలి పెట్టదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారు. రేవంత్ పదవి పోతుందని బండి సంజయ్ తెగ భాధపడిపోతున్నారు. మంత్రులే రేవంత్ ను దించుతారని జాగ్రత్తగా ఉండాలని సంజయ్ సలహా ఇవ్వడం ఏమిటి ? గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనకు బండి సంజయ్ మద్దతు రేవంత్ కుట్రలో భాగమే. బండి సంజయ్ పెద్ద డ్రామా ఆడారు.

రేవంత్ రెడ్డి హరీష్ రావు తన ఇంటికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.హరీష్ మంత్రిగా ఉన్నపుడు రేవంత్ ఎక్కడ ఉన్నారు? హరీష్ రావు వెనకాల ఓ కార్యకర్తగా ఉన్నారు.

హరీష్ రావు ఎవరి చెప్పులో మోశారు అంటున్నారు. రేవంత్ యనమల చెప్పులు తాకుతున్న ఫోటో లోకమంతా చూసింది తన కన్నా హరీష్ రావు ఎంతో సీనియర్ అని రేవంత్ గ్రహించాలి. ఈ అసహనం మాటలు ఎందుకు ? పాలించడం చేత కాకపోతే రేవంత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకోవాలి

LEAVE A RESPONSE