– మంత్రి లోకేష్‌ను కలిసి విరాళాల అందజేత
ఉండవల్లి: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ డిజిటల్, ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులు రూ.5 లక్షలు అందజేశారు. అలాగే, గన్నవరం నియోజకవర్గానికి చెందిన తమ్మిన సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి రూ.10,116 అందజేశారు. మంగళగిరి నియోజకవర్గం చినకాకానికి చెందిన వలివేటి విజయలక్ష్మి రూ.5 వేలు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.