సికింద్రాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మ దినాన్ని పురస్కరించుకొని సేతాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఓ మెగా జాబ్ మేళా జరిగింది. సికింద్రాబాద్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 16 వందల మంది ఈ మేళా లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సెట్విన్ తో పాటు వివిధ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మే ళా లో 24 ప్రయివేటు, కార్పోరేట్ సంస్థలు పాల్గొన్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేత కిరణ్ కుమార్, సెట్విన్ సితాఫలమండీ సెంటర్ ఇంచార్జ్ నవీన్, నేత కరాటే రాజు, శ్రీకాంత్ లు నియామక పత్రాలను అందించారు