చూసి కూడా తెలుగు స్పష్టంగా తప్పులు లేకుండా మాట్లాడలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రా?
• సవాంగ్ పదాన్ని సవాంగం అని, గుంటూరుని గుండూరని, సార్వభౌమాధికారం మాటను అసలే పలకలేని వ్యక్తి వంకరభాష మంత్రులు రోజా, బొత్స, అంబటి, సలహాదారు సజ్జలకు కనిపించడంలేదా?
• లోకేశ్ బాబు ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్, కార్న్ జీ మెలన్ యూనివర్శిటీలో బ్యాచ్ లర్ సైన్స్ లో డిగ్రీ, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివిన వివరాల్ని మీడియాసాక్షిగా ప్రజలముందు ఉంచాం.
• జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు.. ఎక్కడ… ఏం చదివాడో వైసీపీనేతలు, మంత్రులు చెప్పగలరా? ఆయన విద్యార్హతల వివరాలు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్స్ బహిర్గతం చేయగలరా?
• 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి.. తరువాత తనకు భారీ ప్యాలెస్ లు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మీడియాసంస్థలు ఎక్కడినుంచి వచ్చాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా?
– వర్ల రామయ్య
చదువుసంధ్యలులేని అవగాహనారాహిత్యులు, విషయపరిజ్ఞానం లేని మూఢులైన వైసీపీనేతలు లోకేశ్ భాషపై అవాకులుచవాకులు పేలుతున్నారు. చేతిలో అవినీతి పత్రిక, చెత్తఛానల్, 5రూపాయల పేటీఎంబ్యాచ్ ఉందని పనిగట్టుకొని ఆయన చదువు, వ్యక్తిత్వం, మాటతీరు, భాషపై విషప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“రోజా, బొత్స సత్యనారాయణ, అంబటిరాంబాబు, సజ్జలరామకృష్ణారెడ్డి సహా, వైసీపీ నేతలంతా వారినాయకుడి మాటతీరు, వంకరభాషపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం. 5కోట్లమందిని పరిపాలించే పీఠంపై కూర్చున్న వ్యక్తి బాగోతమేంటో మంత్రులు, వైసీపీనేతలు, వైసీపీ సోషల్ మీడియా, సాక్షిమీడియానే చెప్పాలి.
రాష్ట్ర డీజీపీగా సవాంగవం ఎప్పుడు పనిచేశాడో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పాలి
పబ్లిక్ మీటింగ్ లో గతంలో డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ పేరుని సవాంగవం అని, సంస్మరణ దినోత్సవం మాటను సంస్మరదినాత్సవం, ఇండికేటర్లలో అనేమాటను ఇండికేటలల్లో అని, లా అండ్ ఆర్డర్ ని లా అండ్ డాన్ అని, మహిళల్ని మహిళని, అప్పగించడం మాటను అప్పగంచడం అని, నాలుగుదశల్ని నాలుగుదషాల్లో అని జగ న్ ఉచ్ఛరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ తెలుగుఉచ్ఛారణ పాండిత్యం ఎం త గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. రాష్ట్రడీజీపీగా సవాంగవం అనేవ్యక్తి ఎప్పుడు పనిచేశాడో చెప్పండి. ఒకడీజీపీ పేరు పలకలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమం త్రి కావడం నిజంగా శోచనీయం. సార్వభౌమాధికారం అనే పదంమీరు సక్రమంగా పలకగ లరా ముఖ్య మంత్రిగారు? ఆఖరికి ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమా ణస్వీకారం చేసేటప్పుడు సార్వభౌమాధికారం గురించి ఆయన పలికిన పలుకులు సువర్ణాక్షరా లతో లిఖించాల్సిందే. గురివిందగింజ తనకింద ఉన్న నలుపుచూడకుండా మాట్లాడి నట్టు, వైసీపీనేతలు, మంత్రులు జగన్ కి ఉన్న భాషాజాడ్యాన్ని వదిలేసి, లోకేశ్ గురించి మాట్లాడుతున్నారు.
లోకేశ్ బాబు విద్యార్హతల వివరాల్ని గర్వంగా తాము ప్రజలముందు ఉంచుతాం.. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు, ఎక్కడ ఏం చదివాడో మంత్రులు, వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎంబ్యాచ్, బులుగుమీడియా చెప్పగలదా?
లోకేశ్ బాబు ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్, కార్న్ జీ మెలాన్ యూనివర్శిటీలో బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎం.బీ.ఏ. చదివాడు. (వాటికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ను రామయ్య ఈ సందర్భంగా విలేకరులకు చూపారు) జగన్ ఏంచదివాడో… ఎక్కడ చదివాడో రోజా, బొత్స, అంబటి, సజ్జల, వైసీపీ బులుగుమీడియా, పేటీఎం బ్యాచ్ చెప్పగలరా? ఆయన చదువుకి సంబంధించిన పత్రాలు చూపగలరా? మీ నాయకుడు ఏం చదివాడో…ఎక్కడ చదివాడో ప్రజలకు చెప్పే ధైర్యం మీకుందా? జగన్ చదువు హైదరాబాద్ లోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్ తో ఆగిపోయింది. అక్కడకూడా ఆయనకు పదోతరగతి పరీక్షపత్రాలకు సంబంధించి ఏదో చరిత్ర, కేసుకూడా ఉందని చెబుతున్నారు. దానిమూలాల్లోకి తాము వెళ్లడంలేదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన తండ్రిగారు అమెరికా పంపిస్తే, తిరుగుటపాలో వచ్చేశారంటా.! తనచదువుసంధ్యల గురించి చెప్పలేని దుస్థితిలో జగన్ ఉంటే ఆయ న్ని సమర్థిస్తూ వైసీపీనేతలు ఇష్టమొచ్చినట్టు వాగుతారా? ఎండావాన, పగలూరాత్రి అనిలేకుండా 400రోజులు పాదయాత్రకు సిద్ధమైన యువకుడిపై అవాకులు చవాకులు పేలే మూకల్లారా.. జగన్ చదువుసంధ్యలపై సమాధానం చెప్పండి. అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని.. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని అని రంకెలేసిన జగన్, ఎక్కడచదివి ఫస్ట్ క్లాస్ పొందాడో, ఏం చదివి ఫస్ట్ క్లాస్ పొందాడో మాత్రం చెప్పలేకపోయాడు? ఎప్పటికీ చెప్పలేడుకూడా?
జగన్మోహన్ రెడ్డిది మాయామశ్చీంద్ర జీవితం.. దేనికీ సమాధానం చెప్పడు. తండ్రి ముఖ్యమంత్రికాకముందు రూ.2లక్షల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టినవ్యక్తి, నేడు రూ.370కోట్లసంపాదనతో దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు?
జగన్మోహన్ రెడ్డిది మాయామశ్చీంద్ర జీవితం అని నేనంటా..కాదని చెప్పగల ధైర్యం వైసీపీనేతలకు, మంత్రులకు ఉందా? ఏ ప్రశ్నఅడిగినా జగన్ సమాధానంచెప్పరు… అడిగినదానికి కాకుండా ఏదేదో మాట్లాడతాడు? కానీ చంద్రబాబు ప్రజలు అడిగే ప్రతిప్రశ్నకు సమాధానం చెబుతారు. బెంగుళూరులోని ఎలహంకలో నిర్మించిన శ్వేత సౌధం ఎవరిదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడా? కడప, పులివెందులలో నిర్మిం చిన భారీభవనాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మీడియాసంస్థలు ఎక్కడినుంచి వచ్చా యంటే సమాధానం చెప్పరు. 2004కు ముందు సాదాసీదా చిన్నఇంటిలో ఉన్నమీకు ఇన్నిభవనాలు, ఆస్తులు ఎలావచ్చాయోచెప్పరేం ముఖ్యమంత్రిగారు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఇంతడబ్బు ఎక్కడినుంచి వచ్చిందంటే ఏమీచెప్పరేం? నాడు తండ్రి ముఖ్యమంత్రికాకముందు రూ.2లక్షల ఇన్ కం ట్యాక్స్ కట్టిన వ్యక్తి, నేడు భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ ఎలా మారాడు? రూ.370కోట్లతో భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా మీరు న్నారు. అదిఎలా సాధ్యమైందో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు చెప్పరేం? 2004కు ముందు మీపరిస్థితి ఇదికాదే… మీది ఈ దశకాదే? రూ.43వేలకోట్లు మీరు అన్యా క్రాంతం చేశారని సీబీఐ మీ మీద 11ఛార్జ్ షీట్లు వేస్తే, దానికి కూడా మీరు సమాధానం చెప్పరు. ఎవరు ఏం అడిగినా మౌనంగా ఉంటారు. మౌనం అర్థాంగీకారం అనుకోవాలా? అవినీతికేసుల విచారణ జరుగుతుంటే కోర్టుకివెళ్లరు.. కానీ ప్రతిపక్షాలపై మాత్రం ఇష్టమొచ్చినట్టు నిరాధార ఆరోపణలు చేస్తారు. సాక్షి పత్రికలో పెట్టుబడి పెట్టింది ఎవరు.. పెట్టుబడులు పెట్టిన గ్యాంగ్ కు, మీకున్న సంబంధం ఏమిటో చెప్పండి.
వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇంకా మౌనం వహిస్తే ఎలా ముఖ్యమంత్రిగారు? ఏ శక్తి లోకేశ్ పాదయాత్రను అడ్డుకోలేదు
వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇంకా మీరు మౌనం వహిస్తున్నారంటే ఏమనుకోవాలి ముఖ్యమంత్రి గారు? పారదర్శకంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రాజప్రాసాదం, సీఎం పేషీ అంతా మాయామశ్చీంద్రేనే. హత్య జరిగినప్పుడు, అర్థరాత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ మీపక్కలో ఉన్నది నిజంకాదా ముఖ్యమంత్రి గారు?అటెండర్ నవీన్ ఫోన్ మీ ధర్మపత్ని వద్ద ఎందుకుంది? వివేకానందరెడ్డి ఆరాత్రి హత్యగావించబడుతున్నారని మీకుతెలుసు. సమాచారం తెలుసుకోవడానికే మీరు చెరోఫోన్ పట్టుకొని ఆ రాత్రి సిద్ధం గా ఉన్నారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పిరికి ముఖ్యమంత్రి మీరు? యువగళం పాదయాత్రలో లోకేశ్ వేసే ప్రతిఅడుగు వైసీపీనేతలు, మంత్రుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అందుకే పైకిచెప్పలేని భయంతో వారు పదేపదే లోకేశ్ ను అడ్డుకుంటూ, అవాకులు చవాకులు పేలుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా, మైక్ లాక్కున్నా, వెహికల్ సీజ్ చేసినా, లోకేశ్ పాదయాత్ర ఆగదు. ఏశక్తి ఆ బిడ్డ పట్టుదలను అడ్డుకోలేదు” అని రామయ్య తేల్చిచెప్పారు.