జగన్ రెడ్డి, ఆయన పరివారం రాజధాని అంశంపై నాటకాలు ఆడుతున్నారు

• ప్రజల్ని మోసగించడానికి, ప్రభుత్వవైఫల్యాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి, ఆయన పరివారం రాజధాని అంశంపై నాటకాలు ఆడుతున్నారు
• రాజధాని ముసుగులో కులతత్వాలు రెచ్చగొట్టి, ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చి, ప్రజల్ని విభజించి పాలించాలని చూడటం జగన్ అండ్ కో కి న్యాయమా?

• బాబాయ్ హత్యకేసు, రాష్ట్రంపై పడిన అప్పులభారం, ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు సంక్షేమం అందించలేని దుస్థితిలో ఉన్నందునే ప్రభుత్వం విశాఖ రాజధాని అని పబ్బం గడుపుకోవాలని చూస్తోంది
• 6 నెలల్లో రాజధానిలో నిర్మాణపనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని అమరావతి కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదు : అశోక్ బాబు
• ముఖ్యమంత్రికి, మంత్రులకు నిజంగా ధైర్యముంటే, త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రరాజధాని విశాఖపట్నమే అని బిల్లుపెట్టగలరా? : అశోక్ బాబు

జగన్… ఎవరిని మోసగించడానికి గతంలో మూడురాజధానులని, ఇప్పుడు విశాఖపట్నమే రాజధాని అంటున్నావు? దోపిడీ కబ్జాలతో విశాఖకేంద్రంగా కొట్టేసిన ఆస్తుల్ని కాపాడుకోవడానికే జగన్ రాజధాని విశాఖ అంటున్నాడు : ఆలపాటి రాజేంద్రప్రసాద్
• “ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో విశాఖపట్నమే రాష్ట్రరాజధాని అని, తానుకూడా కొద్దినెలల్లో అక్కడికే వెళ్తున్నట్టు చెప్పాడు.
• తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి విశాఖే రాజధాని అంటే, నిన్న బెంగుళూరులో మంత్రి బుగ్గన, నేడు అంబటిరాంబాబు కూడా అదేవల్లెవేశారు.
• విజయసాయిరెడ్డేమో నిన్నరాజధానుల అంశంపై అనధికార బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా పొంతనలేకుండా వ్యవహరిస్తున్న వైసీపీనేతలు, ముఖ్యమంత్రి వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందో లేదో చెప్పాలి.
• రాష్ట్ర రాజధాని అమరావతే అని హైకోర్ట్ చెప్పాక, ఆ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాక ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎంపీలు, నేతలు రాజధానిపై ఇష్టానుసారం ఎలా ప్రకటనలు చేస్తారు?
• కేంద్రప్రభుత్వ ఆమోదంతో రాష్ట్రరాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించాక, అభివృద్ధికోసం రూ.11వేలకోట్లకు పైగా ఖర్చుపెట్టాక, అక్కడే ఉండి పరిపాలన చేస్తున్న వైసీపీప్రభుత్వం ఎవరిని మోసగించడానికి మూడురాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది?
• గతంలో శాసనసభ, పార్లమెంట్ ఆమోదంతో రాజధానిగా అమరావతిని నోటిఫై చేశాక, దాన్నికాదనే అధికారం వైసీపీప్రభుత్వానికి లేదని హైకోర్ట్ స్పష్టంచేశాక, అదే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాక, ముఖ్యమంత్రి, బుగ్గన, సజ్జల, విజయసాయి ఇష్టానుసారం ఎలాప్రకటనలు చేస్తారు?
• అసెంబ్లీలో బిల్లులుపెట్టి, చట్టాలుచేసిన ముఖ్యమంత్రి, మంత్రులు మరలా బిల్లులు సరిగా లేవని కోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కుతీసుకున్నాక, తిరిగి మరలా విశాఖ రాజధాని అని ఎలా చెబుతారు?
• రాజధాని ముసుగులో కులతత్వాలు రెచ్చగొట్టి, ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చి, ప్రజల్ని విభజించి పాలించాలని చూడటం జగన్ అండ్ కో కి న్యాయమా?
• బాబాయ్ హత్యకేసు, రాష్ట్రంపై పడిన అప్పులభారం, ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు సంక్షేమం అందించలేని దుస్థితిలో ఉన్నందునే ప్రభుత్వం విశాఖ రాజధాని అని పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.
• రాష్ట్ర అప్పులపై సరైన లెక్కలు చెప్పలేని స్థితిలో ఉన్న బుగ్గన, సిగ్గులేకుండా రాజధానిపై ప్రకటన ఎలాచేస్తాడు?
• ప్రజారాజధాని అమరావతిపై కావాలనే వైసీపీప్రభుత్వం, జగన్ ఆదినుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారు. నిర్మాణానికి రూ.లక్షలకోట్లు ఖర్చు అవుతుందని, చంద్రబాబు ఏమీకట్టలేదని, అమరావతి ప్రాంతం నిర్మాణాలకు పనికిరాదని, అదికేవలం ఒకకులానికి మాత్రమే పరిమితమని విషప్రచారం చేశారు.
• గతంలో చేసిన దుష్ప్రచారంపై ప్రజలు ఎక్కడ తమను నిలదీస్తారోనన్న భయంతోనే ఇప్పుడు జగన్ రెడ్డి, ఆయన పరివారం విశాఖజపం మొదలెట్టారు. విశాఖ కేంద్రంగా వైసీపీప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన దోపిడీ, భూకబ్జాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, అక్కడున్న వారి ఆస్తుల్ని కాపాడుకోవడానికే జగన్ రెడ్డి, ఆయన వందిమాగధులు విశాఖ రాజధాని అంటున్నారు.
• గతంలో కర్నూలు న్యాయరాజధాని అన్నవారు అక్కడిప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం.
• ఉత్తరాంధ్ర కేంద్రంగా జగన్ రెడ్డి ఎంతగా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాలని చూసినా, చంద్రబాబుపై ఎంతగా విషప్రచారంచేసినా ఆ ప్రాంతవాసులు నమ్మరని ప్రభుత్వపెద్దలు గ్రహించాలి.
• 151 స్థానాలు గెలిచాము…ఏదైనా చేయగలమనే అహంకారంతోనే జగన్, వైసీపీప్రభుత్వం మేంచెప్పిందే వేదమన్నట్టు వ్యవహరిస్తోంది.
• జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి, బుగ్గన దుష్టచతుష్టయంలా మారి రాజధానిపై నీతిమాలినప్రకటనలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.”

ముఖ్యమంత్రికి, మంత్రులకు నిజంగా ధైర్యముంటే, త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రరాజధాని విశాఖపట్నమే అని బిల్లుపెట్టగలరా? :  పరుచూరి అశోక్ బాబు
• “ఏ అంశం అయినా తెలివిగలవాడు నిజాయితీపరుడు అయితే దానిపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాడు. తెలివిలేనివాడే ఎదుటివారిపై నిందలేస్తూ ఏదీచెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటాడు.
• తెలుగుదేశంపార్టీకి రాష్ట్రరాజధానిపై ఎలాంటి అపోహలు, అనుమానాలులేవు. టీడీపీ తొలినుంచీ అమరావతే రాష్ట్రరాజధాని అని చెబుతోంది.
• రాజధానిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం చెప్పాక, రాజధాని ప్రాంత రైతులు కోర్టుని ఆశ్రయించాక, న్యాయస్థానంలోని కేసుల్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.
• ఆరునెలల్లో రాజధానిలో నిర్మాణపనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందితప్ప, రాజధాని అమరావతి కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదు.
• విభజనచట్టంలో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదే అని ఉంది. ఆ ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగింది.
• రాజధాని నిర్ణయించే అధికారం వైసీపీప్రభుత్వానికి లేదుకాబట్టే, ఆ అధికారం తమకు ఇవ్వాలని మీపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టారు. ఆ విషయం మీరు మర్చిపోయారా సజ్జలా?
• ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, లెజిస్లేటివ్అన్ని వ్యవస్థలు కలిసి ఉన్నదే కేపిటల్ అవుతుందని కూడా హైకోర్ట్ గతంలో చెప్పింది.
• ఇవన్నీ తెలిసికూడా ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, ప్రభుత్వసలహాదారు సజ్జల రాజధాని విశాఖ అని చెప్పడం ముమ్మాటికీ కోర్టుని ధిక్కరించడమే.
• బుగ్గన అప్పులపై సమాధానంచెప్పకుండా, రాజధాని విశాఖ అని సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు.
• రాజధానిపై ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఇంకా స్పష్టతరాలేదు కానీ, అమరావతి ప్రాంతవాసులు, ప్రజలకు మాత్రం ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏమీచేయలేరని అర్థమైంది.
• ముఖ్యమంత్రికి, మంత్రులకు నిజంగా ధైర్యం ఉంటే, త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రరాజధాని విశాఖపట్నమే అని బిల్లుపెట్టాలి. అప్పుడు తేలుతుంది రాజధాని వ్యవహారం.. ఈ ముఖ్యమంత్రి, మంత్రుల బాగోతం ఏమిటో?
• ఊరికే ఉబుసుపోక పత్రికల్లో, సమావేశాల్లో రాజధాని అది..ఇది అని ప్రకటనలు చేస్తే ప్రభుత్వం, ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
• హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు అర్థంకాకే జగన్ అండ్ కో ఇంకా రాజధానిపై పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు.
• ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడఉంటే అక్కడే అన్నివ్యవస్థలు పనిచేస్తాయి. దాన్ని తాముకాదనము.. కానీ ప్రభుత్వవ్యవస్థల ప్రతిరూపాలైన సముదాయాలు సమూహం ఉండేది మాత్రం రాజధానిలోనే.
• జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికే కాదు… దేశంలో ఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కోర్టుల్ని, వాటి ఆదేశాలను తప్పుపట్టే అధికారం లేదు.”

Leave a Reply