మీ తరపున పోరాడుతున్నానని ప్రభుత్వం నా గొంతు నొక్కుతోంది

• కనీసం మీ కష్టాలు తెలుసుకునేందుకు కూడా మైకు ఇవ్వడం లేదు.
• పోలీసులను అడ్డుపెట్టి జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు యువగళాన్ని అడ్డుకుంటున్నారు..
• గతంలో రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా మనం ఎవర్నీ అడ్డుకోలేదు…స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకోనిచ్చాం…దాన్ని వాళ్లు మరిచారు.
• మంత్రి రోజా మహిళల్ని అడ్డగోలుగా అవమానిస్తున్నారు.
• తెలుగింటి ఆడపడుచులు రోజాకు సారె తీసుకెళ్తే రోజా వాళ్లను జైలుకు పంపింది.
• అడ్డగోలుగా వ్యవహరించిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టను.
• మీ సమస్యలు చెప్పండి….వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచిద్దాం.

• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చాడు..
• కానీ అధికారంలోకి వచ్చాక మద్యం వ్యాపారాన్ని జగన్ రెడ్డి అధికంగా చేస్తున్నాడు.
• ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కెమికల్ ల్యాబ్ కు పంపితే అది పురుగుల మందుకంటే విషతుల్యమని రిపోర్టులు వచ్చాయి..
• కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోంది…అదీ చాలక సారా బట్టీలు నడుపుతున్నారు.
• రోడ్డుకు ఒకవైపు పాఠశాల…మరోవైపు మద్యం షాపు ఉంది ఈ రాష్ట్రంలో.
• చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సారా బట్టీలను ధ్వంసం చేశాం..
• కల్తీమద్యం, సారాయిపై మహిళలు పెద్దఎత్తున ఉద్యమించాలి..మీకు మేం అండగా ఉంటాం.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిని నిషేధిస్తాం.
• తూర్పుగోదావరిలో టీడీపీ మహిళలు కల్తీ సారాపై పోరాడితే వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు.
• మహిళల సమస్యలపై పోరాడుతున్నా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది.
• నాపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి 20కేసులు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా మనం భయపడే పరిస్థితి లేదు.
• మహిళల సమస్యల్ని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం.
• ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదు…ప్రజలు శాశ్వతం.
• ప్రభుత్వాలు మారినప్పుడు పేదవాళ్లకు అమలయ్యే పథకాలు నిలుపుదల చేయకూడదు.
• చంద్రన్న బీమాను కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది.
• పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునివ్వాలనే సదుద్దేశంతో చంద్రన్నబీమా పెట్టాం..
• ఈ పథకం అమలైన అనేక కుటుంబాలు అప్పుల ఊబినుండి బయటపడి ప్రశాంతంగా బతికాయి..
• పేద,మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన భోరోసా ఈ పథకం.
• 2014లో ఒక ఇంట్లో ఎంత మంది అర్హులుంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబు చేశారు.
• ఒక ఇంట్లో కనీసం ఇద్దరికైనా పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
• జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు ఎలా నిలిపేయాలో ఆలోచిస్తున్నారు.
• వైసీపీ పాలనలో ఇప్పటికీ 6లక్షల పెన్షన్లు నిలిపేశారు.
• చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ రద్దు చేసిన పెన్షన్లన్నీ పునరుద్ధరిస్తాం..అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం.
• గతంలో టీడీపీ పాలనలో అమలైన విధానాలన్నీ పునరుద్ధరిస్తాం.
• చంద్రబాబు పాలనలో పెన్షన్ రూ.1800పెంచితే…జగన్ రెడ్డి 4ఏళ్లలో రూ.750మాత్రమే పెంచారు.
• దేశంలో ఎక్కడా లేని విధంగా నిత్యావసరాల ధరలు ఏపీలోనే ఉన్నాయి
• కేరళ రాష్ట్రం నిత్యావసరాల ధరలు తగ్గించడానికి బడ్జెట్ లో రూ.2వేల కోట్లు కేటాయించారు.
• చంద్రబాబు సీఎం అయ్యాక నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం…పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గిస్తాం.
• ఆర్టీసీ బస్సు టికెట్ గతంలో రూ.10 ఉంటే నేడు రూ.30కి పెరిగింది.
• ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కూడా డ్వాక్రా మహిళల డబ్బులను వైసీపీ నాయకులు లాక్కుంటున్నారు.
• మహిళలు దాచుకున్న డబ్బులను దోచేస్తున్నారు.
• టీడీపీ ఏనాడూ డ్వాక్రా మహిళలను ఇబ్బందిపెట్టింది లేదు.

• రెండు ఫ్యాన్లు, ఒక లైట్, ఒక టీవీ ఉన్న ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వస్తుంది జగన్?
• ఎస్టీలకు ప్రభుత్వం 200యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తోంది.
• అయినా మీకు లక్ష రూపాయల బిల్లు రావడం ప్రభుత్వ అసమర్థతే.
• జగన్ సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు.
• అందుకే ఈ విధంగా లక్షల్లో బకాయిలు చూపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
• విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం పేదవాడి జేబులు ఖాళీ చేస్తున్నారు.
• జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలను ఘోరంగా మోసం చేస్తున్నాడు.
• 2019ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని జగన్ రెడ్డి విస్మరించారు.
• జగన్ సీఎం అయ్యాక 900మందిపై అత్యాచారాలు జరిగితే జగన్ కనీసం స్పందించలేదు.
• సీఎం ఇంటి సమీపంలోనే ఇటీవల ఓ యువకుడు గంజాయి మత్తులో ఓ దళిత యువతి రాణిని దారుణంగా నరికి చంపేశాడు.
• కనీసం ముఖ్యమంత్రి నోరువిప్పలేదు…కేవలం రూ.10లక్షలు ప్రభుత్వం ప్రకటించింది.
• ఏపీలో దిశచట్టం లేదు…కానీ ఏదేదో చేస్తున్నట్లు జగన్ మహిళల్ని మోసం చేస్తున్నాడు.
• ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు.
• జగన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కాకుండా వాటిని ఎలా రద్దు చేయాలో ఆలోచిస్తున్నాడు.
• మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తాం.
• జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశాడు.ఆసుపత్రులకు బిల్లులు కట్టడం లేదు..
• చంద్రన్న పాలనలో ఆరోగ్యశ్రీ పథకం చాలా ఎక్కువగా అమలైంది..
• ఈ పథకానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు జగన్.
• నేడు వైఎస్ఆర్ పేరును కూడా జగన్ చెడగొడుతున్నాడు.
• జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు దేనికీ పనికిరాదు.
• ఏపీకి జగరోనా అనే వైరస్ పట్టింది….చంద్రన్న అనే వ్యాక్సిన్ పడితేనే రాష్ట్రం బాగుపడుతుంది.
• జగరోనా వైరస్ కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదం..మరోసారి జగన్ సీఎం అయితే రాష్ట్రం దివాలా తీయాల్సిందే.
• చంద్రన్నను సీఎం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

Leave a Reply