నిబద్దతకి దక్కిన అరుదైన అవకాశం

తూమాటిని వరించిన మండలి అభ్యర్థిత్వం
రాజకీయాలలో నిబద్దత నిజాయితీ ఉంటే అలాంటి వారికి అరుదైన అవకాశం లభిస్తుంది అనేందుకు నిదర్శనం కందుకూరు నియోజకవర్గం పోలినేనివారి పాలెం కి చెందిన తూమాటి మాధవరావు నిదర్శనం. గ్రామీణ ప్రాంతం రైతు కుటుంబం లో జన్మించి చిన్న నాటి నుండి క్రమశిక్షణ తో ఎదిగి కందుకూరు తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన మాధవరావు అంచెలంచెలుగా ఎదిగారు.కాలేజీ చదువు ముగించుకుని హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు నిర్వహిస్తూ ఎదిగాడు.
కొంత కాలం తర్వాత తిరిగి కందుకూరు చేరుకుని అప్పటి రాజ్ మహల్ సినిమా హాలు ని తీసుకుని సినిమా వ్యాపారం చేసి ఆ సినిమా హాలు ను కొనుగోలు చేసి రాజ్ యువరాజ్ పేరుతో నిర్వహించాడు.మధ్యలో కొంత కాలం పలు దిన పత్రికలలో జర్నలిస్ట్ గా పని చేసాడు.2011 లో వైసిపి తీర్థం పుచ్చుకుని క్రమ శిక్షణ గల కార్యకర్తగా ఎదిగాడు.2017 లో వై.ఎస్. జగన్మోహన రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర కి కందుకూరు నియోజకవర్గం లో నాయకత్వం వహించి విజయ వంతం చేశాడు.
అప్పటి నుండి కందుకూరు నియోజకవర్గం లో వైసిపిని బలోపేతం చేయడం తో పాటు పార్టీ విజయానికి అప్పడు పోతుల రామారావు,తాజాగా మానుగుంట మహీధర రెడ్డి విజయానికి కృషి చేశాడు. పార్టీ కి నిబద్దత నిజాయితీ తో చేసిన సేవలకు వైసిపి పార్టీ నాయకత్వం గుర్తించి స్థానిక సంస్థల కోటా శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించింది.అరుదుగా కార్యకర్తలు లభించే అవకాశం దక్కినందుకు తూమాటి మాధవరావు పార్టీ నాయకత్వానికి వై.ఎస్.జగన్ మోహన రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
కందుకూరు నియోజకవర్గానికి శాసన మండలి లో ప్రాతినిధ్యం కల్పిస్తూ అవకాశం ఇచ్చినందుకు నియోజక వర్గ వైసిపి శ్రేణులు,ఈ ప్రాంత జర్నలిస్ట్ లు,కందుకూరు లోని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు వైస్సార్ కంగ్రేస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply