అదనపు రుణం అర్హత సాధించలేకపోయిన ఏపి

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో… దేశంలోని 22 రాష్ట్రాల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి… కేవలం ఏడు రాష్ట్రాలకు అదనపు రుణం కల్పించేందుకు నిర్ణయించింది. రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.5,392 కోట్ల అదనపు రుణం పొందేందుకు అర్హత సాధించింది. తెలంగాణ తరవాత రూ. 2,869 కోట్లతో పంజాబ్‌ రెండోస్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాలు అదనపు రుణం అర్హతను కోల్పోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ వెనకబడింది. దీంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయింది.

Leave a Reply