Home » వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయం

వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయం

కృష్ణా డెల్టాలో మూడు పంటలకు నీరందిస్తాం
తెలుగుదేశం మహిళా పక్షపాత పార్టీ
జగన్ బయటకు వస్తే చెట్లు నరికివేత, రోడ్లు కూల్చివేత
5 ఏళ్లల్లో జగన్ 5 సార్లైనా నష్టపోయిన రైతనన్న కలిశారా?
గోతుల్లో మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు కడతారా?
దళిత పథకాలకు అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న ఘనుడు జగన్
రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్న జలగ జగన్
– వేమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

వేమూరు: . సైకో జగన్ అవమానాలు భరించలేక జడ్పీ ఛైర్మన్ క్రిస్టియానా, సురేష్, కుర్రా నాగమల్లేశ్వరిలు టీడీపీలో చేరినందుకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఏ ప్రాంతానికి వెళ్లినా అభ్యర్ధులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెబుతున్నారు. నెత్తిన పెట్టుకున్న కుంపటిని దించాలని, రాక్షస ప్రభుత్వాన్ని దింపాలని ఇప్పటికే నిశ్చయించుకున్నారు. వైసీపీలో కొంత మంది మంచోళ్లు, కొంత మంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అనుకున్న మంచోళ్లే మనకు కావాలి. ప్రజాగళం సభకుప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ జగన్ సభలకు రూ.20 కోట్లు ఖర్చు, 1500 బస్సుల, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్ పంచుతున్నారు. అది జగన్ సిద్ధం. మాది ప్రజాగళం.

జగన్ బయటకు వస్తే చెట్లు నరికివేత, రోడ్లు కూల్చివేత

ఐదేళ్లు జగన్ బయటకు వచ్చారా? ఎవరినైనా కలిశారా? తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా? ఎమ్మెల్యే, మంత్రులను కలవడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ నేను ఇలా చేయలేదు. పేద ప్రజల కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. జగన్ బయటకు వస్తే చెట్లు నరికివేత, రోడ్లు కూల్చివేత చేస్తారు. సభకు రాకపోతే పథకాలు అమలు కావంటూ భయపెడుతున్నారు. పథకాలు పోయినా పర్వాలేదు. మళ్లీ బాబు వస్తాడు. మా పథకాలు మాకు వస్తాయని ప్రజలు అంటున్నారు. మా తమ్ముళ్లు హ్యాంకర్ ఉన్న షర్ట్ వేసుకొని ప్రజాగళం సభకు వస్తున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు నేను, పవన్ వెళితే గోదావరి గర్జించింది. నా జీవితంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి. ఇది ఊహించని అనుభూతి.

5 ఏళ్లల్లో జగన్ 5 సార్లైనా నష్టపోయిన రైతనన్న కలిశారా?

ఈ ప్రాంతంలో అధిక రైతాంగం ఉన్నారు. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో రైతులు పూర్తిగా నష్టపోయారు. తుఫాను కంటే అసమర్ధ ముఖ్యమంత్రి నిర్వాకం వలన రైతన్నలు నష్టపోయారు. మురికి కాల్వలు తవ్వకపోవడంతో ఆ నీరు పంటలకు రావడంతో పంటలని నష్టపోయారు. ఏ రోజైనా పంట బీమా ఇచ్చా రా? ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది. దానిని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్.

ధాన్యం కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ఈ ఊర్లో మిల్లులు ఉంటే ఇక్కడ అమ్మటానికి వీలు లేదు. ఎక్కడో పక్క ప్రాంతాలకు అమ్మాల్సిన పరిస్తితి. తుఫాను వస్తే రైతన్నలను పరామర్శించని ముఖ్యమంత్రి జగన్. కానీ నేను మీ సమస్యల కోసం మీ దగ్గరకు వచ్చి, జగన్ ను ప్రశ్నిస్తే కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. 5 ఏళ్లల్లో 5 సార్లైనా జగన్ మీ పొలాలకు వచ్చాడా? ఇప్పుడు ఎన్నికల సమయంలో ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. మొన్న తుఫాన్ పోయాక వచ్చిన జగన్ పరదాల చాటున చూసి వెళ్లిపోయాడు

ప్రజావేదికతో మొదలు పెట్టిన విధ్వంసం పట్టిసీమ దాక ఆపలేదు

ఒకప్పుడు ఓటు కోసం నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దాలు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. పరదాల చాటున నాటకాలు చేసేందుకు ఇప్పుడు బయటకు వచ్చాడు. కృష్ణా డెల్టాలో తుఫాన్లతో నష్టపోతున్నారు. మొదటి పంటకు నీళ్లు అందటం లేదు. అందుకే పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లందించడంతో ఒక పంట ముందు వేసే పరిస్థితికి వచ్చారు. 13 లక్షల ఎకరాలకు నీరందించాం.

పట్టిసీమ టిడిపి కట్టించిందన్న కక్షతో ఆపేశారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం పట్టిసీమ దాక వచ్చారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే గుంటూరులో మూడు పంటలకు నీరందించవచ్చు. అందుకే పోలవరం 72 శాతం పూర్తి చేశాం. 2020 నాటికి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. కాని జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాంఫ్రం వాల్, కాఫర్ డ్యాం, గైడ్ బండ్ లు కూలిపోయారు. ఏం తెలియకుండా మొత్తం నాశనం చేశారు.

గోతుల్లో మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు కడతారా?

అమరావతి మన రాజధాని. ఒకప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభూతితో పిలుపునిస్తే, నా మీ నమ్మకంతో 29వేల రైతులు 35వేల ఎకరాలు స్వచ్ఛంధంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. జగన్ అమరావతిని ఆమోదిస్తానని ఎన్నికల ముందు చెప్పి, తరువాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాడారు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. మొండం ఉంచి తలతీసేశారు. అలాంటి వాళ్లకు ఓట్లు వేస్తారా? అదే రాజధాని వచ్చి ఉంటే పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ కంటే మెరుగైన విద్యాలయాలు ఇక్కడకు వచ్చేవి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇక్కడికే వచ్చేవి. మట్టి పనులు చేసుకోవాలన్నా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి.

దళిత పథకాలకు అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న ఘనుడు జగన్

పాము తన గుడ్లను మింగేస్తుంది. అలాగే జగన్ కూడా ఎవరైతే ఓట్లు వేస్తారో వారి నెత్తిన చెయ్యి పెడతాడు. నా ఎస్సీలు అంటూ వారిపై దాడులు చేయిస్తాడు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలు మాత్రమే. రూ.25వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు మళ్లించారు. మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ ను కొట్టి చంపారు. మాస్క్ అడిగిన సుధాకర్ ను పిచ్చి వాడి చేసి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీని జగన్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీలకు అందించే 27 పథకాలు రద్దు చేశారు. నాడు దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్లుగా కాకుండా ఓనర్లుగా తీర్చిదిద్దే జగన్ వాటిని రద్దు చేశారు. అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య కోసం ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమని చెబితే, జగన్ అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకొని విదేశీ విద్యను నిర్వీర్యం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పట్టించుకోలేదు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏ దళితుడైనా జగన్ కు ఓటు వేస్తారా?

విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి, సంక్షేమ పాలన కావాలా?

సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా? డ్రగ్స్, గంజాయి కావాలా? యువతను మోసం చేసి గంజాయి తెచ్చి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ముఖ్యమంత్రిని క్షమిస్తారా? జే బ్రాండ్ పేరుతో నాశిరకం మద్యంతో పేదవాళ్ల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. గతంలో క్వార్టర్ రూ.60 ఇప్పుడు రూ.200 పెరిగింది. అంటే రూ.140 పెరిగింది. ఒక బాటిల్ కాదు రెండో బాటిల్ తాగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్న జలగ జగన్

వైసీపీ భూ మాఫియా కావాలా? మీ ఆస్తులకు రక్షణ కావాలా? నడుం విరిగే రహదారులు కావాలా? మెరుగైన రహదారులు కావాలా? గుంతల్లో మట్టి వేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంటా? రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే జలగ జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్లలో మీ కష్టాలు తగ్గాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ జీవితాలు మెరుగయ్యాయా? నిత్యావసర ధరలు పెరిగాయా? ఆస్థిపన్ను పెంచారు, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు, చార్జీలు, ఉప్పు, పప్పు అని పెంచేసి పూర్తిగా అన్యాయం చేశారు.

టీడీపీ మహిళా పక్షపాత పార్టీ

గత టీడీపీ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నిర్ణయించుకోవాలి. ఎన్నికలు 30 రోజులు ఉన్నాయి. రచ్చబండ, కాలనీలు, కిరాణాషాప్, పాన్ షాప్, హోటళ్ల, బస్సులో చర్చించాలి. మే 13న ఎన్నికల జరిగే రోజున పోలింగ్ స్టేషన్ కువెళ్లే ముందు ఆలోచించుకోవాలి. సూపర్ సిక్స్ తో పాటు పవన్ సూచించిన మరో 4 పాయింట్లు కలిపి అమలు చేయాలని కోరితే ఒప్పుకున్నాం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. సూపర్ సిక్స్ లో ఆడబిడ్డలకు పెద్ద పీట వేస్తున్నాం. దేశంలో ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చిన పార్టీ టీడీపీ. ఆస్థిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాం. డ్వాక్రా సంఘాలు, న్యాయకత్వ లక్షణాలు నేర్పించాను. ఆర్ధికంగా ఎదగాలని కృషి చేశాం. ఆడపిల్లలు చదువుకోవాలని 33 శాతం ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్ పెట్టాం. అందుకే నేడు ఆడబిడ్డలు ఎక్కువ మంది చదువుకున్నారు. వచ్చిన సంపద పేదవాళ్లకు పంచడం మా అభిమతం. కాని జగన్ అప్పులు తేవడం వాటిని మింగేయడం, వనరులను స్వాహా చేసి మీ జీవితాలను చీకటి మయం చేశారు. కాని మేం మీ జీవితాలను వెలుగులు తెస్తాం.

. నాకు రాజకీయం ముఖ్యం కాదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ నా లక్ష్యం అది కాదు. ప్రతి ఒక్క తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ముందుండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది. కాని ఏపీ అధ్వాన స్థితికి వెళ్లి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. రివర్స్ టెండరింగ్ తో మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్. నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందులు పెట్టినా తట్టుకొని మీ జీవితాల్లో వెలుగు నింపాలని మీ ముందుకు వచ్చాను.

వాలంటీర్లకు మెరుగైన జీవితాన్ని అందించే బాధ్యత మాది

వికలాంగులకు పింఛన్ రూ.6వేలు ఇస్తాం. వాలంటీర్ల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారు. మీరు బానిసలు కాదు. నేను మీకు అండగా ఉంటాను. మీరు ప్రజలకు సేవ చేయడం మిమ్మల్ని గౌరవించుకుంటాం. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయం. 5 ఏళ్లల్లో 5 సార్లైనా జగన్ మీ పొలాలకు వచ్చాడా? రూ.10 నెలకు అందించే బాధ్యత మాది. ఈ మాట జగన్ గొంతులో వెలక్కాయ పడింది. జగన్ విధ్వంస కారుడు నేను నిర్మించే నాయకుడు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు నేను ఉద్దరించడానికి వచ్చాను. రాజీనామా చేయమని వాలంటీర్లను బెదిరిస్తారు. ఈ నెల రూ.10వేలో, రూ.15వేలో డబ్బులు మీ చేతుల్లో పెట్టి మోసం చేస్తారు. వాటి కోసం మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు.

పోలీసులను ఆదుకుంటాం

అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లను రాజీనామా చేయమంటాడా? ఇది ద్రోహం, మోసం కాదా? ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవడం మంచిది కాదు. మేం ప్రజల కోసం సేవ చేస్తాం, మీ పార్టీకి కాదని వాలంటీర్లు చెప్పండి. వాళ్లకు రూ.10వేలే కాదు లక్షలు ఎలా సంపాదించుకోవాలో దారి చూపిస్తాం. పోలీసులకు జీతాలు సరిగ్గా రావడం లేదు. పీఆర్సీ, పీఎఫ్, డీఏ లు లేవు. బకాయిలు ఇవ్వడం లేదు. నిన్న విశాఖలో కానిస్టేబుల్ రివాల్వర్ తో కాల్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రభుత్వ హత్య కాదా? నేడు చీరాలలో ఇసుక డెడ్ బాడీ వచ్చింది. అంటే చంపటం ఎంత సులవయ్యింది.

కొత్తగా వచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తాం

ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా? మీ ల్యాండ్స్ అని జగన్ పేరుతో రాసుకుంటానని కొత్త చట్టం తీసుకువస్తున్నారు. 90 రోజుల్లో మీరు చెక్ చేసుకోకపోతే మీ భూమి మీకు దక్కదు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదంటా? ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒక సారి కంప్యూటర్ చూసుకోవాలంటా. ఒకప్పుడు నిజాం పొలాన్ని వేరేవాళ్లకు దానం చేసేవారు. నేడు అలాంటి పరిస్థితి. మీ పొలం మీ పట్టాదారు పాసు పుస్తకం దాని పైన బొమ్మ ఎవరిది? జగన్ తాత, నాయనా మీకు భూములు ఇచ్చారా? మీ భూమిని, మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా జగన్ ఫోటో వేసుకుంటున్నారు. ఆయన రికార్డ్ మారిస్తే గోవిందా? ప్రభుత్వం వస్తేనే ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యతను తీసుకుంటాం. మీ భూమికి రక్షణ నేనుంటాను. పోలీసులకు ఇబ్బందులు ఉండవు. దుర్మార్గల చేతుల్లో రాష్ట్రాన్ని బలి తీయ వద్దు.

ఇక్కడ దోచుకున్న వాళ్లను జగన్ వేరే ప్రాంతాలకు పంపుతున్నాడు

సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్ని ఉప్పు నీరు వస్తున్నాయి. అందుకు చెక్ డ్యాంలు కట్టించి ఆదుకుంటాం. పోతర్లంక ఎత్తిపోతల పథకానికి రూ.50కోట్లతో సిద్ధం చేస్తే జగన్ అన్నింటిని నాశనం చేశారు. తప్పకుండా పని చేయించే బాధ్యత మాది. శాశ్వత పట్టాలను పరిష్కరిస్తాం. దళిత కాలనీల్లో రోడ్లు వేయించిన ఘనత ఆనంద్ బాబుది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మేరుగ నాగార్జున దోచుకోవడానికి సంతనూతల పాడు వెళ్లాడు. ఆయన గ్రాఫ్ పడిపోయిందని జగన్ అంటున్నారు.

మరి జగన్ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇప్పడు వేమూరికి దండుపాళ్యం బ్యాచ్ దిగుతుంది. ఇక్కడ దోచుకోవడం అయిపోయింది కాబట్టి మరో ప్రాంతానికి మనుషులను మారుస్తున్నారు. ఒక ఊర్లో చెత్త మరో ఊర్లో బంగారామా? ఎడ్ల బండ్లో ఇసుకకు డబ్బులు వసూలు చేసిన ఘనుడు. రెడ్ సాండ్ స్మగ్లర్ ను మళ్లీ ఈ ప్రాంతానికి తెచ్చారు. ప్రజల పన్నులు కడితే అంతా జగన్ మింగేసి మనకు చిల్లర చల్లారు. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలి. దుర్మార్గుడిని ఇంటికి పంపాలని పొత్తు పెట్టుున్నాం. అంతే కాకుండా రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం మద్ధతు కావాలి.

వైనాట్ పులివెందుల?

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లు గెలవబోతుంది. ఏపీలో 150కి పైగా సీట్లు రావాలి. అందుకే వైనాట్ పులివెందుల అంటున్నాం. బాబాయ్ ని గొడ్డలి వేసినందుకు జగన్ కు ఓటు వేయాలా? 25కి 25 ఎంపీలు ఎన్డీఏనే గెలవాలి. నీతి నిజాయితీగా చిరునామాగా ఉన్న కృష్ణ ప్రసాద్ ని ఎంపీగా గెలిపించాలి. ఐదో సారి ఆనంద్ బాబు ఎమ్మెల్యే అభ్యర్ధిగా మీ ముందుకు వచ్చారు. మాకు తోడుగా ఉండండి, దండు పాళ్యం బ్యాచ్ ను నమ్మవద్దు.

Leave a Reply