సిఐడి అడిషనల్ డీజీపీకి వర్ల రామయ్య పిర్యాదు

రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు లోకేష్ గారు నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారంటూ సిఐడి అడిషనల్ డీజీపీ కి పిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల రామయ్య. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు జూమ్ మీటింగ్ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు పదిలో ఫెయిల్ అయి. తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఫెయిల్ అయి బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలకు జూమ్ మీటింగ్ ద్వారా భరోసా కల్పించేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీ లు మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారు. రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేరపూరిత కుట్రతో, లోకేష్ గారి జూమ్ మీటింగ్ భగ్నం చేయాలని, రాజకీయ వైషమ్యాలు కల్పించాలని అక్రమంగా చొరబడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు మా నాయకుడు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారు. వారి అక్రమ చొరబాటు భయాందోళన కల్గిస్తూ నేరపూరిత కుట్రగా కనిపిస్తున్నది. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూసిన అధికార వైసీపీ నేత‌ల‌పై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయండి. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోండి.

Leave a Reply