– విజేతల్లో నెల్లూరు కుర్రాడు బిల్లా అభిలాష్
పాండిచ్చేరి యూనివర్సిటీలో మొత్తం 13 స్కూల్ ఉండగా స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ మరియు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ లో ఏబీవీపీ ప్యానెల్ నుండి ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నెల్లూరు చెందిన బిల్లా అభిలాష్ ఇక్కడ మాస్కోనికేషన్ చదువుతున్నాడు అదేవిధంగా పాండిచ్చేరి చెందిన రుభశ్రీ విజయ బేరి మోగించారు. ఈ డిపార్ట్మెంటులో ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నప్పటికీ అభ్యర్థులు ఎవరు ముందుకు రాకపోవడం అనేది ఈ విద్యార్థి సంఘాలను ఈ ఎన్నికల్లో విద్యార్థులు తిరస్కరించారు అనేదానికీ ఇదే నిదర్శనం.
ఎన్నికల్లో గెలవడానికి ఈ స్కూల్ ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించిన మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ కాలర్ నెల్కి జగన్ వర్మ వ్యూహాల వల్లే ఇది సాధ్యమైందని పలువురు ఆయనని అభినందించారు. అనంతరం మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ముందు విజేతలకి పూలమాలతో సత్కరించి స్వీట్ తినిపించారు.
ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రెసిడెంట్ డెబనీత్ దత్తా, సెక్రటరీ ఆదిత్య సనల్ విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయి వివేక్ అల్లకొండ, కీర్తి కేసన్, కౌసల్య, మురళి , రవి , హరి ప్రసాద్ , జ్ఞాన , రవళి , హరి ఫిరోజ్ సాయి దేవ్ లు పాల్గొన్నారు.