– 3 వందల కోట్ల అంచనాలు కాస్త 2 వేల కోట్లు అయ్యాయి
– సామాజిక తెలంగాణ సాధన మా లక్ష్యం
– మా అజెండా నచ్చిన వారికి, నచ్చని వారి కూడా స్వాగతం
– భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం
– నాలుగు నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటాం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్: ప్రజల సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తాం. మేము ఎక్కడికి వెళ్లిన సమస్యలు వెల్ కం చేస్తున్నాయి. తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్రమొక్కటే పరిష్కారం అనుకున్నాం.
నేను 20 ఏళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నాను. ఫీల్డ్ లో ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు వద్దకు వెళ్తే అంత క్లారిటీ వస్తుంది. ఆదిలాబాద్ లో లో పత్తి రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. పత్తి సీజన్ ఉందని, అదే విధంగా మొంథా తుపాను ఎఫెక్ట్ ఉందని ప్రజా ప్రతినిధులకు ముందే తెలుసు. ఎంపీ, ఎమ్మెల్యే సహా ఏ నాయకులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ అయినా సమస్యను ప్రభుత్వం ముందు ఉంచి ఒత్తిడి పెంచాల్సింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ద ప్రభుత్వానికి పత్తి రైతుల మీద లేదు. జూబ్లీహిల్స్ లో రైతులు లేరు కనుక వారిని పట్టించుకోవటం లేదు.ఏదైనా రూరల్ ప్రాంతంలో ఉప ఎన్నిక వచ్చి ఉంటే రైతుల అన్ని సమస్యలు తీరేవి. ప్రతిపక్షం మాదిరిగా వాయిస్ మేము వినిపిస్తాం. చిన్న సమస్యలైనా పరిష్కారం అవుతున్నాయి.
సీసీఐ ఛైర్మన్ తో కూడా నేను మాట్లాడతాను. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారితో నాకు పరిచయం ఉంది. వారితో మాట్లాడి పత్తి రైతుకు మేలు చేస్తా. ఆంధ్రా, తెలంగాణలో తుపాను కారణంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. వీటి గురించి బీజేపీ ఎంపీ కేంద్రంతో మాట్లాడి పత్తి రైతుకు మేలు చేయాలి.
ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా- కొరటా, కుప్తి ప్రాజెక్ట్ లు కావాల్సి ఉన్నాయి. చనాఖా- కొరటా ప్రాజెక్ట్ ది గమ్మతి కథ. 3 వందల కోట్ల అంచనాలు కాస్త 2 వేల కోట్లు అయ్యాయి. ప్రాజెక్ట్ వ్యయం ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి? మహారాష్ట్ర లో 1500 ఎకరాల భూ సేకరణ ఇంకా జరగనే లేదు. ప్రాజెక్ట్ నీళ్లు ఓవర్ ఫ్లో అవుతే ఇబ్బంది లేకుండా మహారాష్ట్ర వైపు బండ్ కట్టారు. కానీ మన వైపు బండ్ కట్టలేదు. మన ప్రజా ప్రతినిధులకు ఇంత చిన్న విషయంపై కూడా శ్రద్ధ లేదు. చనాఖా, కొరటా ప్రాజెక్ట్ తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసుకునేందుకు జాగృతి శ్రేణులు పోరాటం చేస్తాయి. కుప్తి ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. సిరిచెలిమ వద్ద కూడా ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉంది. బోథ్ లో అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. బీజేపీ వాళ్లు ఎన్నికలు వచ్చినప్పుడు రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా దేవుని కోసం పనిచేయాలి. ఎంపీ నిధుల నుంచి నగేష్ అన్న రూ. 20 లక్షలు ఇవ్వాలి. నేను కూడా వీలైనంత సాయం చేస్తాను. వచ్చే ఏడాది నాటికి సమస్య లేకుండా చేసుకుందాం.
ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవటంతో ప్రైవేట్ కాలేజ్ లు బంద్ చేస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమైన ప్రభుత్వం సిగ్గు పడాలి. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు. కానీ పేద పిల్లలకు చదువు చెప్పే కాలేజ్ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వరా? జాగృతి ని మళ్లీ బలోపేతం చేస్తాం. ప్రజల సమస్యలు తీర్చేందుకు మేమంతా పనిచేస్తాం. భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. సామాజిక తెలంగాణయే మా లక్ష్యం. మా అజెండా నచ్చిన వారిని, నచ్చని వాళ్లను కూడా వెల్ కం చేస్తున్నాం.