టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు కార్యకర్తలు సిద్దంగా లేరు

– పువ్వాడ – కేటీఆర్ కి వ్యాపార సంబంధాలు
– గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో గౌరవ ప్రద హోదా
– పువ్వాడ మీద ఎందుకు చర్యలు తీసుకోరు?
– కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని చోట్ల తొక్కేస్తున్నరు
– కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి

రాష్ట్రంలో ప్రోటోకాల్ లేదు.. ప్రొసీజర్ లేదు.గవర్నర్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో కి వెళ్తే సెక్యూరిటీ కూడా ఉండదా..? ఐఏఎస్.. ఐపీఎస్ లకు రాజకీయాలకు ఏం సంబంధం? అధికారులు రావాలి కదా!?గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో గౌరవ ప్రద హోదా ..ఇదేనా పరిపాలనా విధానం.ఖమ్మం లో pd యాక్టు పెట్టి వేధిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.

Acp తప్పుడు స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు.పువ్వాడ అజయ్ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసు లో A 1 నిందితుడు.పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటే ఏసిపి కి సంబందం లేదా..?ఏసిపి కూడా… ఈ ఆత్మహత్య కేసులో నిందితుడే.అమిత్ షా కనీసం స్పందించి కేసు లు పెట్టించండి.మా పార్టీ కార్యకర్తల నే కాదు.. మీ కార్యకర్తల ఆత్మహత్య చేసుకుంటే కూడా చర్యలు తీసుకోరా..?

పొత్తుల కోసం మేము అంతా ఇంట్రెస్ట్ గా ఏం లేము.కార్యకర్తలు కూడా trs తో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరు.టీఆర్ఎస్ మాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మాకు. పువ్వాడ కి..కేటీఆర్ కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి.పువ్వాడ మీద ఎందుకు చర్యలు తీసుకోరు?
మహిళా గవర్నర్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం మొగతనం కాదు..
కుసంస్కారంతో చేస్తున్న పనులు. ఏ మహిళ గురించి ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ఊరుకునేది లేదు.

అమరావతి కాదు కమ్మ రావతి అన్నాడో సీఎం, పెట్టు ఆ పేరు చూద్దాం . కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని చోట్ల తొక్కేస్తున్నరు. మీకు అన్నిటికీ కమ్మ ల అవసరం ఉంది. తర్వాత తొక్కేస్తున్నారు.