తల్లి గర్భం నుంచే..
దేశాన్ని ప్రేమించినవాడు!
నేలతల్లి… పుట్టిన మట్టి కోసం
ఈనాడే ప్రాణాల్ని అర్పించినవాడు!
మన అల్లూరి సీతారామరాజు!
రామరాజా..
నీ సాహసం చిరస్మరణీయం!
నీ పయనం..
ఓ మహాగాథ
ఎన్నటికీ చెరపలేని
అమరగాథ!
వలసవాదం
భారతీయ ఆత్మగౌరవంపై
వెర్రెక్కి పొగరుతో
ఊగిపోతుంటే..
నువు రక్తం తడిసిన
ధ్వజంలా రెపరెపలాడీ..
వనాల గుండెల్లో
ఆశయ జ్వాలలతో
బ్రిటిష్ శక్తిని చెదరగొట్టి..
జ్వాలాతోరణమై మండావు!
గుండెమండిన
‘గురి’
లా యోధుడవై
ఎదురు నిలిచినపుడు..
ఒక్క ‘నువ్వు’ చాలని
జనం నినదించారు!
ప్రశ్నలు సమాధానాలు
కాదు..
పోరాట బాణాల
చర్యలే నీ భాష!
నాటి నీ ఎద దర్పమే
నేటికీ మన భారతీయ
ఆశ!
నీ వర్థంతి ..నీ జ్ఞాపకాల పండుగ!
నీవేర్పరచిన బాటలోనే
నడవాలని…
నీ చరిత్ర చదవడమే గాక..
సాహసాల గుండెతో
అనురించాలని
ఆశపడుతున్నామీరోజు!
జై అల్లూరి సీతారామరాజు!
-చిలువూరి రామకృష్ణరాజు