రూ.5000 కోట్ల పెట్టుబడులు
అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ తో ఒప్పందం
హైదరాబాద్: అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ రాష్ట్రంలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. దీనికి సంబంధించి దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. కంపెనీ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.హైదరాబాద్ లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి అన్నారు. ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ. 5000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తుందని అన్నారు.