Suryaa.co.in

Andhra Pradesh

జనరంజకంగా బీజేపీ మేనిఫెస్టో

-అన్ని రంగాలకూ ప్రాధాన్యం
-స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్
-స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్
– బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

విజయవాడ: వివిధ రంగాలను ఆకట్టుకునేలా ఏపీ బీజేపీ మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించింది. ఆ మేరకు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ అయి, వివిధ అంశాలపై కసరత్తు చేసింది.మేనిఫెస్టో కమిటీ లో బిజెపి జాతీయ నేత పేరాల శేఖర్ జీ, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, కమిటీ సభ్యులు పాకా సత్య నారాయణ, లంకా దినకర్, వెంగమాంబ శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, సుధీష్ రాంబొట్ల, ఆర్ డి విల్సన్, డాక్టర్ వినూషా రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు.

మేనిఫెస్టో రూపకల్పన లో అంశాలు, కమిటీ భేటీ వివరాలను బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మీడియాకు వెల్లడించారు. లంకాదినకర్ ఏమన్నారంటే… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన పార్టీ కి చెందిన 10 రంగాల్లో నిపుణులతో సమావేశం జరిగింది. మేనిఫెస్టో సర్వస్పర్శి చేసేవిధంగా రూపుదిద్దుతున్నాం. ప్రాథమికంగా అన్ని వర్గాల ప్రజలు కు సంబంధించిన అంశాలు రూపొందిస్తున్నాం.

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ దేశం లో అగ్రగామి రాష్ట్రంగా తీర్చి దిద్దడం ద్యేయంగా మేనిఫెస్టో రూపొందించబోతున్నాం. స్పష్టమైన తేదీ లతో ఉద్యోగ క్యాలెండర్ నియామకాలు. దళిత, నిమ్న వర్గాల వారికి మేని ఫెస్టో లో ప్రాధాన్యత
రైతులకు ప్రాధాన్యత ఇస్తాం.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కు ప్రాధాన్యత ఇస్తాం . సహకారం, వ్యవసాయ రంగానికి నీటి వనరులు,సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం,. స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. పరిశ్రమలు ఏర్పాటు కు మౌలిక వసతులు, ఎయిర్,రైలు, రోడ్డు కనెక్ట్ విటీ పెంచడం.పారిశ్రామిక వాడల్లో రాయితీ లు. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల వారికి రుణాలు ప్రకటిస్తాం. వైద్య రంగం అందరికీ అందుబాటులోకి తెస్తాం. వికలాంగుల సంక్షేమం కోసం పథకాలు రూపొందిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యం తో మేనిఫెస్టో రూపొందిస్తున్నాం.

LEAVE A RESPONSE