– ముఖ్యమంత్రి అయింది మొదలు, రాజకీయాలను అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డిపనిగా పెట్టుకున్నాడు?
– దోపిడీ కోసమే కోసమే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చాడు
• కూల్చివేతలు, అణచివేత తో మొదలైన జగన్ పాలన, అవినీతి, దోపిడీతో అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది
• మూడేళ్లపాటు తన దోపిడీతో రాష్ట్రాన్ని సర్వనాశనంచేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించకుంటే, రాజారెడ్డి వారసుడిగా మిగిలిపోయి, తన చరిత్రను తానే ఎర్రసిరా తో లిఖించు కుంటాడు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.బీ.సుధాకర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ రాజకీయాలను అడ్డంపెట్టుకొని వేలకోట్లు ఎలాలాసంపాదించాలన్నఆలోచనలతోనే ముందుకువెళుతున్నారని, ఆయన అధికారంలోకి వచ్చిపరిపాలనచేపట్టింది మొదలు కూల్చివేతలు, అణచివేతలు, కొల్లగొట్టడా లు, పన్నులు,ఛార్జీల బాదుడుతప్ప ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి అనేవి మచ్చుకైనా కనిపిం చడంలేదని టీడీపీ రాష్ట్రఅధికారప్రతినిధి డాక్టర్.ఎన్.బీ.సుధాకర్ రెడ్డి తెలిపారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రజలను వెర్రివాళ్లనుచేస్తూ, రాష్ట్రంలోని సహజవనరుల్ని కొల్లగొట్టి వేలకోట్లు దోచుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనచేస్తున్నాడు. కలియుగప్రత్యక్షమైన ఏడుకొండలవాడి ఏడు కొండలచుట్టూ ఏడునియోజకవర్గాలున్నాయి. తిరుపతి, చంద్రగిరి, పీలేరు, రాయచోటి, రాజంపేట, కోడూరు, శ్రీకాళహస్తి నియోజవర్గాల్లో ఇద్దరు ఎర్రచందనం దొంగలు ఉన్నారు. వారు ఉదయం లేచింది మొదలు ఎర్రచందనం సరిహద్దులు దాటించే పనిలోనే నిమగ్నమై ఉం టారు. వారికి పుష్పారెడ్డి అనే నాయకుడు ఉన్నాడు.
ఇటీవల వచ్చిన పుష్పసినిమాలో అతని ఇతివృత్తం గురించి చూపించారు కూడా. కోడూరు, రాజంపేట నుంచి రేణిగుంట, పుత్తూరు మీదుగా నేరుగా చెన్నైకి, తలకోన,పీలేరు, చంద్రగిరి నుంచి వెదురుకుప్పం మీదుగా మరో మార్గంలో కర్ణాటకకు ఎర్రచందనాన్ని తరలిస్తుంటారు. నిత్యం రూ.5కోట్ల విలువైన ఎర్రచందనం వివిధరకాల వాహానాల్లో ఎర్రచందనం తరలిస్తుంటారు.
ఎర్రచందనం నరికివేత, అక్రమరవాణాపై గతం లోచాలాసార్లు చెప్పాను. నేను ఇటీవల కూడా ఈ అంశంపై ప్రజలకు చెప్పాను.. అది జరిగిన కొద్ది రోజులకే ఎర్రచందనం దొంగలు వారివాహనానికి యాక్సిడెంట్ అయ్యి పోలీసులకు దొరికి పోయారు. మరోఘటనలో కూంబింగ్ కు వెళ్లిన అటవీసిబ్బందికి మరికొందరు పట్టుబడ్డారు. ఆ విధంగా కేవలం మూడురోజుల్లోనే సుమారు రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం అధికారులకు పట్టుబడింది. కొందరు ఎర్రచందనం దొంగలను పట్టుకొని పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైల్లోఉంచారు. అలా జైల్లో ఉండి వచ్చిన వారికి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పదవులు కట్టబెట్టాడు. రాయలసీమప్రాంతం కరువుప్రాంతమైనా అక్కడుండే సహజసంపద చాలాచాలా విలువైనది. వాటిలో ఎర్రచందనం అన్నింటకంటే విలువైంది. అలానే నల్లరాళ్లు, ఎర్ర రాళ్లుగా పిలువబడే గ్రానైట్ లాంటిరాయినికూడా విదేశాలకు తరలిస్తున్నారు.
శేషాచలం అడవులనుంచి ఎర్రచందనం కర్ణాటక, చెన్నైకి తరలిపోతుంటే, అక్కడినుంచి అదే వాహనాల్లో అక్రమమద్యం రాష్ట్రానికి దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో 26జిల్లాలుంటే జిల్లాకొక మంత్రిపదవి ఇవ్వకుండా కేవలం చిత్తూరుజిల్లాకే మూడుమంత్రిపదవులు ఇచ్చారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అనేకరకాల మాఫియాలతో జిల్లాతోపాటు, రాష్ట్రాన్ని కూడా చంకనాకించేశాడు. ఇప్పుడు ఆయనకుతోడు, రోజాకూడా తోడైంది. వారిద్దరి మధ్యన డిప్యూటీసీఎంనారాయణస్వామి ఉండనే ఉన్నాడు.
బోర్డర్ సెక్యూరిటీఫోర్స్ దేశానికి రక్షణగా ఉంటుంటే, ఎర్రచందనాన్ని తరలించడంకోసం ఈప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ జంపింగ్ ఫోర్స్ ని తయారుచేసింది. వారు రాష్ట్రసరిహద్దుల్లో ఉండి… రాష్ట్రంలోని విలువైన సంపదను దేశాలకుతరలించపనిలో నిమగ్నమై ఉంటారు.
ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్నారు. ఆయనకు తోడు అవినీతిపరులైన మంత్రులు తోడయ్యారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన కేబినెట్ వారి దోపిడీని కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ అతిత్వరలోనే మరోశ్రీలంక కావడంఖాయం. ఇప్పటికే శ్రీలంక ప్రజలు తాగునీరుకూడాలేక ఆకలితో చనిపోయేపరిస్థితికివచ్చారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం సంక్షేమకార్యక్రమాలపేరుతో జనాన్ని ఏమారుస్తూ, వారిదోపిడీని యథే చ్చగా కొనసాగిస్తున్నారు.
ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వం సాగిస్తున్న దోపిడీని ప్రజలు గమ నించారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి కూడా అర్థంచేసుకున్నారు. మొన్నజరిగిన కొత్త కేబినెట్ కూర్పుతోనే ముఖ్యమంత్రి పతనంమొదలైంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని దేవుడని చెప్పారో, వారే ఆయన దిష్టిబొమ్మలు దహనంచేశారు. విశాఖపట్నంలో మొత్తం విజయసా యి రెడ్డి భూకబ్జాలే కనిపిస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నారో..ఏం చేస్తున్నారో తెలియదు.
తిరుమలకు వచ్చే భక్తులు నానా అవస్థలు పడుతుంటే అక్కడ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి భక్తులకు క్రమశిక్షణలేదంటున్నారు. ఆయనకుఅసలు క్రమశిక్షణ ఉందా? అవినీతి మయమైన జగన్మోహన్ రెడ్డి పాలనతో బెంబేలెత్తుతూ, భయంతో తిరుమలకు వచ్చే భక్తుల కు క్షమాపణ లేదనిచెప్పడానికి సిగ్గుందా? అవినీతిపరులైన అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నాళ్లు ఇలా రాష్ట్రాన్ని దోచుకుంటారో చూస్తాము.
అంబేద్కర్ జయంతి నాడైనా భారత రాజ్యాంగం ఏంచెప్పిందో, ప్రజల హక్కులను ఎలాకాపాడాలో,అభివృద్ధిని ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటేమంచిది. లేకపోతే ఆయన రాజశేఖర్ రెడ్డి వారసు డిగా కాకుండా కేవలం రాజారెడ్డి వారసుడిగానే చరిత్రలో మిగిలిపోతారు. ఆయన చరిత్రను కూడా ఎర్రసిరాతో రాసిఉంచుతారు.