-స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో జరిగిందంటున్న రూ.241కోట్ల అవినీతి సైకోరెడ్డి సృష్టే
-64 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలపై జగన్ రెడ్డి కన్నుపడటం రాష్ట్ర యువత దురదృష్టం
-సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో లేని అవినీతిపై విచారణ జరిపిన జగన్ రెడ్డి జేబుసంస్థ సిఐడీ నేటికీ ఒక్క ఆరోపణ రుజువు చేయలేకపోయింది
-ఆగస్ట్ 2021లో అంతా సక్రమంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు లేఖలురాస్తే సీఐడీ డిసెంబర్,2021 లో కేసు ఎలానమోదుచేసింది?
-కొన్నిలక్షలమంది విద్యార్థుల జీవితాల్ని బాగుచేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మీకు కడుపుమంట దేనికి?
-ఈడీ పేరువినగానే ఏ2 లాగా ఫోన్ లు పారేసుకునే రకంకాదు మేము
-టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
2 లక్షల పైచిలుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరుని చూసి, సంతోషంగా ఉంటున్న యువతను చూసి సైకోరెడ్డి ఓర్వలేక, తనలోని సైకోయిజాన్ని నిద్రలేపి, తన జేబు సంస్థ సీఐడీని విచారణ పేరుతో కొందరిపైకి ఉసిగొల్పి, తన పకోడి పేపర్లో చంద్రబాబు, లోకేశ్ లు రూ.241కోట్ల అవినీతి చేశారంటూ విషపురాతలు రాయిస్తున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…! “రాష్ట్ర ప్రజలకు మంచి జరగడాన్ని జీర్ణించుకోలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. ప్రజలు ఏడుస్తుంటే ఆనందపడటం, వారు హలో లక్ష్మణా అంటుంటే సంతోషపడటం ఆయనకు ఎనలేని తృప్తినిస్తుంది. మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ లా ప్రజలు ఏడుస్తుంటే, జగన్ రెడ్డిలోని సైకోయిజం బయటకొస్తుంది. అందుకే ప్రజలంతా ముక్తకంఠంతో సైకోపోవాలి-సైకిల్ రావాలి అని గొంతెత్తి నినదిస్తున్నారు.
ఏపీ యువత ఉద్యోగాలు పొంది సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే సైకోరెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలపై విషం చిమ్ముతున్నాడు
“యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు. వాటిలో భాగంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్ర్రాలు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ కేంద్రాలను రాష్ట్రంలోని ప్రముఖ విద్యాలయాల్లో ఏర్పాటు చేశారు. విద్యాభ్యాసం చేస్తున్న యువతలోని నైపుణ్యాలను వెలికితీసి, వారికి నచ్చిన రంగాల్లో మెరికల్లా చేయడానికే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో టీడీపీ ప్రభుత్వహాయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
భవిష్యత్ లో వారు చేయబోయే ఉద్యోగానికి అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలను యువత లో పెంపొందించడమే స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ప్రధాన లక్ష్యం. ఆక్రమంలో సిమెన్స్ కంపెనీ వారు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 90శాతం వ్యయం భరించడానికి ముందుకొస్తే, మిగిలిన 10శాతం రాష్ట్రప్రభుత్వం భరించేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. జూన్, 2015 న చేసుకున్న ఒప్పందంలోనే రాష్ట్రంలో నెలకొల్పదలచిన 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన పరికరాలు, ఇతర సామాగ్రి వివరాలు పొందుపరచడమైంది. అన్నికేంద్రాల్లో యువత నైపుణ్యాభివృద్ధికి అవసరమైన సాఫ్ట్ వేర్, ఇతర పరికరాల ఏర్పాటు ఒప్పందంలో ముందే పకడ్బందీగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత కేవలం ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలనే పరిమితం చేయకుండా అమిత వేగంతో 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను పూర్తి చేసి అందుబాటులోకి తెవడం జరిగింది. మార్చి31, 2020 నాటికే ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో 2,11,984 మంది నైపుణ్య శిక్షణను పూర్తిచేసుకుంటే, వారిలో 64వేల మందికి ఉద్యోగాలుకూడా వచ్చాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటుచేశాక, వాటిని గాలికి వదిలేయకుండా నాటి టీడీపీప్రభుత్వం 64వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల శిక్షణా కార్యక్రమం కోవిడ్ సమయంలోకూడా నిర్విరామంగా కొనసాగింది. దాదాపు 18వేల మందికి పైగా ఆన్ లైన్ లో శిక్షణను అందిం చడం జరిగింది. స్కిల్ డెవలప్ కేంద్రాలద్వారా 2లక్షలపైచిలుకు యువత, వారికుటుంబాలు బాగుపడటం జీర్ణించుకోలేని సైకోస్టార్ జగన్ రెడ్డి తనలోని సైకోని నిద్రలేపాడు.
ఆక్రమంలో పనిగట్టుకొని మరీ, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలపేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ పసలేని ఆరోపణలకు తెరలేపాడు. ఎవరు సంతోషంగాఉన్నా, ఏ కుటుంబం పచ్చగా ఉన్నా చూసిఓర్వలేని సైకోరెడ్డి, తన బులుగు మీడియా ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని విషపురాతలు రాయించాడు. అంతటితో ఆగకుండా ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేశ్ తినేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఉన్నాయని సిగ్గు, శరంలేకుండా దుష్ప్రచారం చేస్తున్నాడు. కానీ, వాస్తవంగా, దేశంలోని ఏ దర్యాప్తుసంస్థ ఆర్ధికపరమైన అంశాలతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన వాటిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ పరిగణలోకి తీసుకుని అధనపు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ కోవలోనే నేడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు విషయమై సీఐడీ నమోదు చేసిన తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ దృష్ట్యా ఈడీ వారు ఆ ఎఫ్.ఐ.ఆర్ లో ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకానీ బులుగు మీడియా రాస్తున్నట్లు ఈడీఐ విచారణ అనేదే జరగలేదు. నోటీసులు అందుకున్న వ్యక్తులు ఈడీ ముందుకు హాజరై వారుఅడిగిన సమాచారాన్ని అందిస్తారు. ఈడీ పేరు వినగానే పోన్ లు పారేసుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. ఢీల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవడంతోనే మన ఏ2 విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందని పోలీసులకు పిర్యాదు చేసిన విషయం ప్రజలు మరిచిపోలేదు. అటువంటి తప్పుడు పిర్యాదులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి మా నాయకులు ఏ రోజు రాదు. ఈడీలను చూసి భయపడి, ఫోన్ లు పారేసుకోవడానికి తామేమీ ఏ2లా కుంభకోణాల్లో మునిగితేలుతున్నవాళ్లంకాదు. లిక్కర్ స్కామ్ లో ఎక్కడ తనను మూసేస్తారోనన్న భయం తో విజయసాయి రెడ్డి భయంతో ఫోన్ పోయిందంటూ నాటకాలు ఆడుతున్నాడు.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో ఫిజికల్ వెరిఫికేషన్ తాము చేయలేదని శరత్ అసోసియేట్ ఆడిటింగ్ సంస్థ తమ ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నది వాస్తవం కాదా?
స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల అవినీతిపై అజయ్ రెడ్డి ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేయించాడని తాడేపల్లి జీతగాడు సజ్జల ఏదేదో వాగుతున్నాడు. శరత్ అండ్ అసోసియేట్స్ ఆడిటింగ్ వారు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్, పేజీ నెం-12లో ఏముందో సజ్జల తెలుసుకోవాలి. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో తనిఖీలకు సంబంధించి, తాము ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని వారు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చెయ్యని శరత్ అసోసియేట్స్ సంస్థ, అక్కడెలాంటి పరికరాలు లేవని, ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయలేదని, శిక్షణ అంతా బోగస్ అని, రూ.241కోట్లు మింగేశారని ఏ విధంగా తేల్చగలరు?. తొలుత మీ ప్రభుత్వం శరత్ అసోసియేట్స్ ఆడిటింగ్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలన్న నిబంధన ఉంచి తరువాత ఆ నిబంధనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో జవాబు చెప్పాలి. నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలలో ఫిజికల్ చేస్తే మీ విషపు రాతలు బట్టబయలు అవుతాయనే భయంతో ఆ నిబంధన తొలగించారా? ఇది మీ కుట్రకు ఒక ఉదాహరణ కాదా?
సీమెన్స్ సంస్థ ఎటువంటి పరికరాలు అందించిందో కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ స్టాక్ రిజిస్టర్ చూస్తే తెలుస్తుంది
సిమెన్స్ సంస్థ గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వ్యయంలో 90 శాతం సిమెన్స్ భరించాలి. కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని ప్రకారం సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థ వారు ఈ కేంద్రాలకు సంబంధించిన అన్ని రకాల సాప్ట్ వేర్ మరియు అధునాతన పరికరాలు తాము పెట్టాల్సిన 90 శాతం పెట్టుబడికి గాను అందించడం జరిగింది. ఇదే విషయాన్ని 40 కాలేజీలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు లిఖితపూర్వకంగా దృవీకరించడమైనది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారికి ఈ 40 కాలేజీల యాజమాన్యాలు తాము సిమెన్స్, డిజైన్ టెక్ వారి నుంచి పొందిన వివిధ అధునాతన పరికరాలు, సాప్ట్ వేర్ మొ. లగు వాటిని స్టాక్ రిజిస్టర్ లలో పొందుపరిచి సంతకాలు చేసి మరి అందించడం జరిగింది. అంతేకాకుండా తమకు సిమెన్స్ వారి వద్ద నుంచి అందినటువంటి పరికరాలన్నీ అద్బుతంగా పనిచేస్తున్నాయని తమ కేంద్రాలలో విధ్యార్ధులు సైతం మంచి శిక్షణ పొందుతున్నారని లిఖితపూర్వకంగా ఆగష్టు, 2021 లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు లేఖలు అందించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జే.ఎన్.టి.యు.కే ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడ, ఆంధ్ర యూనివర్శిటీ కాలేజీ విశాఖపట్నం, జీఎం.ఆర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జి. పుల్లారెడ్డి కాలేజీ, కర్నూలు వంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలలే కాకుండా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ఆయన ఇడుపులపాయ ఎస్టేట్ కు అతిసమీపంలో ఉన్న త్రిబుల్ ఐటీ- ఇడుపులపాయ వారు కూడా తమ స్టాక్ రిజిస్టర్ లను, లేఖలను స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారికి అందించడం జరిగింది. ఈరోజున స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్న వైసీపీ నాయకులు ఎవరైనా వారికున్న అనుమానాలను ఇడుపలపాయ త్రిబుల్ ఐటీకి వెళ్లి నివృతి చేసుకోవచ్చు. ఆగష్టు, 2021 లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 కాలేజీల యాజమాన్యాలు తమ శిక్షణా కేంద్రాలు అన్ని సక్రమంగా నడుస్తున్నాయని లేఖలు ఇస్తే డిసెంబర్ , 2021 లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు బోగస్ అని ఎఫ్.ఐ.ఆర్ ఏ విధంగా నమోదు చేస్తారు. ఇది కుట్ర కాక మరేంటి. కడప ఇడుపులపాయ ఎస్టేట్ సమీపానికి కూడా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడిది. ఎటువంటి రాజకీయ దురుద్దేశం, కక్షపూరిత దోరణి లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు నాయుడి సంకల్పానికి ఇది నిదర్శనం కాదా.
స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో శిక్షణకు అవసరమైన పరికరాలు, వస్తువులు ఉన్నాయో లేదో సజ్జలకు తెలుసా..?
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఆర్ జేయూ కేటీ డైరెక్టర్ ఆగస్ట్ 06, 2021న, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు రాసిన లేఖ చదివితే సజ్జలకు వాస్తవాలు తెలుస్తాయి. సదరు లేఖలో సిమెన్స్ వారు తమకు ఇచ్చిన ప్రతీ వస్తువు బ్రహ్మం డంగా పనిచేస్తోందని, అన్నీ చూశాకే తాము సంతకం పెట్టామని పేర్కొన్నారు. ఇంత పక్కాగా, పకడ్బందీగా సిమెన్స్ సంస్థ, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలకు పరికరాలు, పనిముట్లు సరఫరాచేస్తే, సిగ్గులేకుండా సజ్జలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో మరే విద్యాసంస్థ లేక, చంద్రబాబు నాయుడుగారు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రం నెలకొల్పారా? తరతమ, ప్రాంతీయబేధాలు లేకుండా యువత భవిష్యత్ బాగుండాలన్న సదుద్దేశంతోనే చంద్రబాబుగారు ఆ పనిచేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు నెలకొల్పిన ప్రతి విద్యా సంస్థల యాజమాన్యాలు సిమెన్స్ వారు తమకు నాణ్యతతో కూడిన మంచిపరికరాలు, వస్తువులు ఇచ్చారని అవన్నీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయని లేఖలురాస్తే, సిమెన్స్ సంస్థ ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తారా? సిమెన్స్ సంస్థ వస్తువులు, పరికరాలు కండీషన్ లో ఉన్నాయని స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల నిర్వాహకులు ఆగస్ట్ లో లేఖలురాస్తే, డిసెంబర్ నెలలో మీరు తప్పుడు ఎఫ్ ఐఆర్ నమోదుచేయిస్తారా? స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరు చూసి ఓర్వలేకనే సైకోస్టార్, సజ్జల కలిసి తప్పుడు ఆడిటింగ్ రిపోర్ట్ తో రూ.241కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎలా బోగస్ అవుతుందో కూడా సమాధానం చెప్పాలి.
సీఐటీడీ (సెంట్రల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ టూల్ డిజైన్) వారు ఇచ్చిన వాల్యూయేషన్ రిపోర్ట్ చూశావా సజ్జలా?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి వ్యాల్యువేషన్ జరగలేదని ఈ ప్రాజెక్టు అంచనాలన్నీ బోగస్ అని నోరు పారేసుకుంటున్న సజ్జల ఒక్కసారి సిఐటీడీ వారు ఇచ్చి వ్యాల్యువేషన్ రిపోర్టు చదవాలి. క్రాస్ వెరిఫికేషన్ జరగకపోతే, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ వారు ఇచ్చిన నివేదిక సంగతేమిటి? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు, 05-12-2015న రాసిన లేఖ ఆధారంగా వాల్యూయేషన్ చేసినట్టు, మొత్తం వ్యాల్యూయేషన్ కరెక్టేనని సీఐడీటీ తననివేదికలో చెప్పింది వాస్తవం కాదా? ప్రాజెక్ట్ కాస్ట్ కి సంబంధించి, ఒక్కో క్లస్టర్ కు రూ.559కోట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో, ఆ వ్యాల్యూయేషన్ మొత్తం నూటికినూరుశాతం కరెక్ట్ అని వారుచెప్పలేదా?
సీఐడీటీ వారు వ్యాల్యూయేషన్ చేశాక ఇచ్చిన రిపోర్ట్ లో…..
సాఫ్ట్ వేర్ కు సంబంధించి రూ.247.78కోట్లు,
డిజిటల్ కోర్స్ లకు రూ.249.75కోట్లు,
హార్డ్ వేర్ కు సంబంధించి రూ.48.48కోట్లు,
సర్వీసెస్ కు సంబంధించి రూ.13.31 కోట్లు,
మొత్తంగా ఒక్కో క్లస్టర్ కు రూ.559.33 కోట్లు వ్యయం అవుతుందని మొత్తం 6 క్లస్టర్ల ప్రాజెక్టుకు (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టి.ఎస్.డీ.ఐ లు) రూ.3300 కోట్లకు పైబడి వ్యాల్యువేషన్ ఉంటుందని సిఐటీడి వారు చెప్పింది నిజం కాదా? ఈ నిజాలన్నీ తెలిసి కూడా బులుగు బ్యాచ్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై విషం కక్కడం కుట్రకాక మరేంటి.
మానిటరింగ్ కమిటీ, సెలక్షన్ కమిటీ లో సభ్యులుగా ఉన్న అజయ్ జైన్, రావత్ లను ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన ఎల్ ప్రేమచంద్రారెడ్డిని ఏ రోజైనా ఈ ప్రాజెక్టు గురించి విచారించారా?
గంటా సుబ్బారావు గారు రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణతో పాటు గత ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి జీ.ఓ. నం 8 ద్వారా రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ కాగా, రెండోది సెంటర్ సెలక్షన్ కమిటీ. ఈ రెండు కమిటీలలో ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులైన అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ సభ్యులుగా ఉన్నారు. జగన్ చుట్టూ ప్రతినిత్యం తిరేగేటువంటి ఈ ఇద్దరు ఐఏస్ఎస్ అధికారులను స్కిల్ డెవలప్ మెంట్ అమలు గురించి ఏ రోజైనా ఈ ప్రభుత్వం విచారించిందా? స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ప్రాజెక్టు విషయమై నేటి వరకు ఎందుకు విచారించలేదు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందినవారని వదిలేశారా? కేవలం ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడుగారు, లోకేష్ గార్లపై బురద చల్లాలన్న దురుద్దేశంతో గంటా సుబ్బారావు గారు లక్ష్మీనారాయణ గార్లను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. నేటి వరకు రావత్ మరియు అజయ్ జైన్ లను విచారించకపోవడమే సైకో రెడ్డి కుట్రకు మరొక ఉదాహరణ. స్కిల్లర్ సంస్థ పన్ను ఎగ్గొడితే, దానికి గత ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు పరికరాలు ఏర్పాటు చేయడం కోసం డిజైన్ టెక్ సంస్థ స్కిల్లర్ అనే మరో సంస్థతో ఒప్పందం చేసుకుంది. సదరు స్కిల్లర్ సంస్థ, కొన్ని కంపెనీల నుంచి వస్తువులు సేకరించే క్రమంలో తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించి, జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఏదో ఒక కంపెనీ వారి స్వలాభం కోసం పన్ను ఎగ్గొడితే, దానికి గత ప్రభుత్వంకు, చంద్రబాబు సంబంధమేంటో సైకోరెడ్డి సమాధానం చెప్పాలి. ఇది కేవలం పన్ను ఎగవేతకు సంబంధించిన అంశం. అదే విషయాన్ని జీఎస్టీ డిపార్ట్ మెంట్ వారు కూడా దృవీకరించారు. ఒక పన్ను ఎగవేత అంశాన్ని భారీ కుంభకోణం అన్నట్టు చిత్రీకరించి లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ప్రాజెక్టును నాశనం చేస్తున్నారు. ఒక దుకాణంలో మనం ఒక వస్తువు కొంటే ఆ దుకాణం యజమాని ఆ తర్వాత వస్తువుపై కట్టాల్సిన పన్ను ఎగ్గొడితే అది వస్తువు కొన్న వినియోగదారుడికి ఏం సంబంధం. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు విషయంగా జరిగింది కూడా అదే.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష్ కు లక్ష్మీ నారాయణ ఏనాడు ఎండీగా లేరు
జగన్ రెడ్డి తన బులుగు పత్రికలో లక్ష్మీనారాయణ మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారని రాశారు. కనీసం వాస్తవాలు కూడా తెలుసుకోకుండా పిచ్చిరాతలు రాయడం అంటే ఇదే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు లక్ష్మీనారాయణ గారు ఏ రోజు ఎండీగా లేరు. వారు కేవలం ఒక డైరక్టర్ గా మాత్రమే పనిచేశారు. పచ్చి అబ్బద్దాలు రాయడం బులుగు పత్రిక సాక్షికే చెల్లింది. చంద్రబాబు నాయుడు ఎంతో సదుద్దేశంతో రాష్ట్ర యువత భవిత కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టుపై దురుద్దేశంతో సైకో రెడ్డి జగన్ విషం చిమ్ముతున్నారని, రాష్ట్ర ప్రజలు ప్రాజెక్టు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవాలి” అని పట్టాభిరామ్ విజ్జప్తి చేశారు.