Suryaa.co.in

Political News

ఆంధ్రాలో అన్నీ వృధా ఖర్చులే

– ఉద్యోగులకు ఇవ్వాలంటే మాత్రం డబ్బులుండవు
– వాలంటీర్లకు మాత్రం దోచిపెడతారా?
– ఉద్యోగులకు ఇవ్వాలి అంటే మాత్రం ఆర్థిక భారం
– అదే అడ్డమైన దుబారాకు మాత్రం ఎప్పుడూ సిద్ధం

ఏ రాష్ట్రం లో లేని విధంగా ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు ఎంత నష్టమో.. అంతకుమించి ఖజానాకు ఎంత భారమో.. రేషన్ ఆటో ల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ప్రతి ఒక్క రు ఆలోచించండి.

వాలంటీర్ల జీత భత్యాలు:
మొత్తం వాలంటీర్లు : 192964
నెల జీతం మొత్తం : 5000
మొత్తం : 192964 X 5000= 964820000

రేషన్ ఆటోల ఖర్చు:
Ration ఆటోల కొనుగోలుకు అయిన ఖర్చు 900 కోట్లు
మొత్తం రేషన్ ఆటోలు: 9260
ఆటోకి నెలకు అన్ని కలిపి ఇచ్చేది : 16000
నెలకు: 9260X16000 = 14816000

అంటే పక్క రాష్ట్రాల్లో అవేవి లేవు.
ఇవి ఏపీ లో లేకుండా ఉంటే నెలకు మిగిలే ఖర్చు :
964820000 + 1481600 = 1112980000

అంటే రఫ్ గా 2 1/2 ఇయర్స్ వేసుకుందాం. అంటే 30 నెలలు అనుకుందామ్.
1112980000X30 = 33389400000
ఇంత డబ్బు తగలేసే బదులు, లబ్ది దారుడికి రేషన్, నిత్యఅవసరాల కోసం నెలకు 3500 నగదు బదిలీ నే చెయ్యచ్చు. ఇచ్చే నాశి రకం బియ్యం కి ఇంత అతి చెయ్యడం అవసరమా ? పైగా ఈ మధ్యే వాలంటీర్ల కి బహుమతుల పేరుతో
మరో 258.74 కోట్లు అదనపు భారం.
జగన్ ప్రభుత్వం చేసిన తప్పు అర్ధమయ్యే.. రేషన్ రద్దు చేసి 5 కేజీల బియ్యం కు గాను, ఒక్కో కేజీ కి 20-30 రూపాయలు ఇచ్చే విధంగా ఆలోచన చేసింది.
ఇన్ని రోజులు రేషన్ ఆటోల ఖర్చుకు తగలేసిన వాటి పై విమర్శలు రావడంతో ఆలోచన మార్చుకుంది.

అమరావతి రాజధానిగా కొనసాగించి, నిర్మాణానికి రెండేళ్లు ఇదే డబ్బు ఖర్చు చేసి ఉంటే, ఈ పాటికి అనేక MNC కంపెనీలు ఏపీ లోపెట్టుబడులు పెట్టేవి, దాని ద్వారా లక్షల ఉద్యోగాలు వచ్చేవి, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళేది.
అనవసర దుబారా ఖర్చు చేయటానికి, అప్పుతెచ్చి మరీ తగలేస్తారు, కానీ న్యాయంగా ఉద్యోగులకు రావల్సినవి ఇవ్వటానికి మాత్రం, ప్రభుత్వానికి అదనపు భారం అంటూ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తారు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపు.

– అనిల్ కుమార్

LEAVE A RESPONSE