హీరో అంటే అర్థం తెలుసా
మా నాన్న హీరో అంటాం
ఎందుకంటే నాకు ఏం కావాలో చూసి చూసి చేస్తుంటాడు
నా జీవితం ఎలా ఉంటే ఎక్కడ ఉంటే బావుంటానో అని ఆలోచించి అడుగులు వేయిస్తాడు
నా సంతోషాలు ఏంటో కనుక్కుని వాటిని పూర్తిచేయడానికి కష్టాడుతుంటాడు నిజాయితీగా
అందుకే హీరో అంటాం
నిజాయితీ లేకపోతే నాన్నను కూడా హీనంగానే చూస్తాం
ఎక్కడో దొంగతనం చేసి జైల్లో ఉంటే అతడు మా నాన్న అని చెప్పడానికి సిగ్గుపడతాం
ఆ దొంగతనం మనకోసమే చేసినా ఒప్పుకోలేం
ఇతరులను మోసం చేసినోడిని హీరో అని ఒప్పుకోలేం
అటువంటిది పుష్ప సినిమా ఒక గంధపు చెక్కల స్మగ్లర్ ని హీరో గా ఒప్పుకోవడానికి మీకు మనసెలా వస్తుంది?
అది తప్పు అని నిలదీసుంటే ఫాన్స్ పుష్ప 2 తీయాలన్న ఆలోచన అసలు వచ్చుండేది కాదు.
సినిమా ప్రభావం సామాన్య ప్రజలపై ఎంత ఉంటుందో మీరు చేసే సపోర్ట్ వల్లే కొన్ని సిక్వెల్స్ వస్తున్నాయి.
అయినా సినిమా కాబట్టి అతను డబ్బుల కోసం నటించాడు. ఒకవేళ నిజంగా స్మగిలింగ్ చేయి హీరో అవుతావు అంటే అతడు ఆ పని చేస్తాడా?
ఆ రోజు థియేటర్ లో తొక్కిసలాటకు కారణం.. అక్కడ ఓ మహిళ చనిపోవడానికి కారణం.. అల్లుఅర్జున్ అని కేసు ఫైల్ అయ్యింది.అక్కడ ఆయనది 25 % తప్పు ఉంది. మిగతా 75 % తప్పు ఆ షో కి వచ్చిన ప్రతిఒక్కరిది
అల్లు అర్జున్ ఏమైనా వింత జీవా? మళ్ళీ చూడలేము అని ప్రాణాలు తీసేంతగా తొక్కుకుంటూ వెళ్ళడానికి? ఆయనేమో దేవుడా దర్శనం చేసుకోకపోతే కోటి జన్మల పాపమ్ చుట్టుకోవడానికి?
డీజే సినిమాలో అతనిది డైలాగ్ ఒకటుంది.
ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని.
ఆయన ఒక్కసారి ఆలోచించే బావుండేది.. పుష్ప చిత్రం ద్వారా అతనేం సందేశం పంపుతున్నాడో?!
ప్రభుత్వం కన్నుగప్పి గంధపు చెట్లను ఎలా నరకాలి అనా?
చెక్ పోస్ట్ లో ఎలా తప్పించుకోవాలనా?
లేక పోలీస్ లను ఎలా ఎదవలను చేయొచ్చనా?
ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే.. ఈరోజు ఆ చిత్రం లో నటించినవాడికి బంధోబస్తుగా ఎదవలను చేసిన ప్రభుత్వం పోలీసులు ఉండడమే.
ఆ రోజు ఆ రేవతి చనిపోవడానికి కారణం.. ఆ రోజు ఆ షో లో ఉన్న ప్రతిఒక్కరు.
ఆ పసిపిల్లాడి ఆ దీనస్థితికి కారణం మీరు.
ఆ పాప అమ్మ లేకుండా పోవడానికి కారణం మీరు.
ఆ రోజు ఆ షాలో ఉన్న ప్రతిఒక్కరు సిగ్గుపడాలి.
ఇలాంటి అన్యాయానికి సపోర్ట్ చేస్తూ తీసిన చిత్ర దర్శకుడు సిగ్గుపడాలి.
అందులో .నటించిన అల్లు అర్జున్ సైతం సిగ్గుపడాలి.
ఇక మీద ఆలోచించాలి అందరు