Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్,పానెళ్ళ తయారీ యూనిట్

-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ 
-1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
-అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి
-ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ

దుబాయ్, ఫిబ్రవరి, 17; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం ముందుకువెళుతోంది. ఇప్పటికే 4 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీఈడీబీ మరో కీలక అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో ఎంవోయూ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో గురువారం సాయంత్రం ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం, అలుబండ్ గ్లోబల్ ఛైర్మన్ షాజి ఎల్ ముల్క్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 200 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అలుబండ్ గ్లోబల్ పరిశ్రమకు అవసరమైన 150 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది.

అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, జీ43, ముబాదల గ్రూప్ సమావేశాలతో బిజీగా మంత్రి పర్యటన
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అబుదాబీలోని అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, జీ43, ముబాదల గ్రూప్ లతో గురువారం వరుసగా సమావేశమయ్యారు.”జీ42″ సంస్థ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అబుదాబిలోని “జీ42” ప్రతినిధులతో మంత్రి మేకపాటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ఫండింగ్ పై ప్రధానంగా చర్చించారు. జీ42 ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ కు రావాలని, అక్కడి వసతులను
ap-business పరిశీలించాలని పరిశ్రమల శాఖ మంత్రి ఆహ్వానం పలికారు. పరిపాలన, నైపుణ్య మానవవనరులు, మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాల ఏపీ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. జీ42 కంపెనీ గురించి సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫేలే బ్రెస్చి మంత్రి మేకపాటికి వివరించారు. ఐ.టీకి సంబంధించిన నైపుణ్యం గల యువతకు భారత్, ఏపీలో కొదవలేదన్నారు. ఎనర్జీ, స్మార్ట్ సిటీ, హెల్త్ కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్, ఐ.టీ, టెక్నాలజీ తదితర రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలపైనా చర్చించారు. ఈ కార్యక్రమంలో “జీ42” గ్రూప్ సీఓఓ మన్సూర్ అల్ మన్సోరి, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫెలే బ్రెస్చి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రతీక్ భరదర్వాజ్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ తరిఖ్ బిన్ హెండి, హెల్త్ కేర్ సీఈవో అశిష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.

ముబదల గ్రూప్ పెట్టుబడుల కంపెనీ సీఈవోలతో మంత్రి మేకపాటి సమావేశం
అబుదాబీలోని అల్ మరోరా లో ఉన్న ముబదల కార్యాలయంలో మంత్రి మేకపాటి గురువారం సంబంధిత గ్రూప్ కంపెనీ సీఈవోలతో భేటీ అయ్యారు. సమావేశానికి అబుదాబిలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తో కలిసి హాజరయ్యారు. పారిశ్రామిక వసతులు, రిన్యువబుల్ ఎనర్జీ, విశాఖ మెట్రో ప్రాజెక్టు, పోర్టులలో పెట్టుబడులకు గల అవకాశాలపై మంత్రి ముబాదల సీఈవోలు ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముబదల గ్రూప్ లోని రియల్ ఎస్టేట్, పెట్టుబడులు, మౌలిక వసతుల సీఈవో ఖాలేద్ అల్ ఖుబైసీ, సంప్రదాయ మౌలిక సదుపాయాల డైరెర్టర్ మహ్మద్ అల్ షమీ, గవర్నమెంట్ ఎఫైర్స్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రీమ్ అల్ షమ్సీ, సీఎఫ్ఓ శ్రీధర్ శ్రీనివాసన్ తదితరులు హాజరయ్యారు. అబుదాబిలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఈడీబీ, కేపీఎంజీ ప్రతినిధులు పాల్గొన్నారు.

అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీతో మంత్రి మేకపాటి సమావేశం
మంత్రి మేకపాటి అబుదాబీ పారిశ్రామికాభివృద్ధి సంస్థతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, వాణిజ్యానికి గల అవకాశాలను మంత్రి మేకపాటి అడియా సంస్థకు వివరించారు. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ తో పెట్టుబడుల భాగస్వామ్యానికి ఏపీఈడీబీతో కలిసి ముందుకు వెళతామన్నారు. ఉష్ణోగ్రత తగ్గించి చల్లబరిచే అధునాతన టెక్నాలజీ దిశగా తబ్రీద్ కంపెనీతో ఏపీ ఎంవోయూ కుదుర్చుకోవడంపై అడియా సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.

LEAVE A RESPONSE