అమరావతి నినాదాలతో మారుమ్రోగిన మహా పాదయాత్ర శిబిరం

– రాజధాని అంశంలో ప్రభుత్వం మనసు మార్చాలని ఏడుకొండల స్వామి కి పూజలు నిర్వహించిన రైతులు.
– యాత్ర విరామంలో సాంస్కృతిక కార్యక్రమాలు రైతులతోనే భోజనం చేసిన ఎమ్మెల్యే ఏలూరి,స్వామి,జె.ఏ సి నేతలు
ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు లో మహాపాదయాత్ర రైతుల శిబిరం అమరావతి నినాదాలతో మారుమోగింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం యాత్ర శిబిరంలో తెలుగు దేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,కొండెపి ఎమ్.ఎల్.ఏ స్వామి, జె.ఏ సి నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ మొండి వైఖరిని మార్చాలని ఏడుకొండల వాడికి రైతులు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం రాజధాని అంశం లో రాజకీయ స్వార్థం కోసం 5కోట్ల ఆంధ్రులను చెరిపి వేస్తుందని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్న అమరావతి రాజధానిగా కొనసాగే ప్రభుత్వం మనసు మార్చాలని వేడుకున్నారు. రైతుల విశ్రాంతి శిబిరంలో ఒకే రాష్ట్రం ఓకే ఆంధ్రుల రాజధాని అమరావతి అమరావతి… పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజధాని ఆకాంక్షను నెరవేర్చాలని న్యాయస్థానం టూ దేవస్థానం యాత్రకు శ్రీకారం చుట్టిన అమరావతి రైతుల పాదయాత్ర ఎనిమిదవ రోజు ఇంకొల్లులో యాత్రకు విరామం తీసుకున్నారు. యాత్ర విరామం రైతులు పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మహిళలు కోలాటం,భక్తి పాటలు నిర్వహించారు.కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించారు.రాజధాని ఆకాంక్ష కోసం మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా రైతులు ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారు. దీనికి తోడు యాత్రకు స్వచ్ఛందంగా లక్షలాది రూపాయల విరాళాలు అందించారు సోమవారం ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో పలు గ్రామాల ప్రజలు జేఏసీ నేతలకు విరాళాలు అందజేశారు.
ఇంకొల్లు లో పాదయాత్ర శిబిరం లో విశ్రాంతి తీసుకుంటున్న రైతులకు పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వారికి కొండంత కల్పించారు.
ఐదు కోట్ల ఆంధ్రుల సంకల్పబలంతో అమరావతి రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ప్రజల ఆకాంక్ష బలంగా ఉండడంతో మహాపాదయాత్ర మహాద్భుతంగా కొనసాగుతుందని ఏలూరి సాంబశివరావు, జె ఏ.సి. పేర్కొన్నారు. ప్రజలందరూ ముక్తకంఠంతో అమరావతి రాజధానిగా కొనసాగించాలని దృఢ సంకల్పంతో స్వచ్ఛందంగా తండోప తండాలుగా వస్తున్నారని పేర్కొన్నారు. మహా పాదయాత్ర ప్రారంభం నుంచి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని ఇదే సంకల్పంతో యాత్ర విజయవంతంగా పూర్తి అవుతుందన్నారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏడుకొండలవాడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష సిద్ధిస్తుందన్నారు. యాత్రను చూసైనా ప్రభుత్వం మనసు మార్చుకోవాలని హితవు పలికారు.

Leave a Reply