రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతి నిర్మాణం

Spread the love

– ఎలా చేయాలనుకున్నాడో దార్శనికుడి ఆలోచనా ధోరణి

AMARAVATHI29,000 మంది రైతుల నుండి పూలింగ్ ద్వారా సేకరించిన భూమి: 33,246 ఎకరాలు.
ప్రభుత్వ భూమి: 23,000 ఎకరాలు.
మొత్తం భూమి: 56,246 ఎకరాలు.
రైతుల నుండి సేకరించిన భూమిలో రైతులకు ప్లాట్ల రూపంలో తిరిగి ఇవ్వవలసినది ఎకరానికి 1000 గజాలు చొప్పున షుమారుగా 20% భూమి, అనగా 33,000 ఎకరాలలో 20% =6,600 ఎకరాలు.
రహదారులకు 30% చొప్పున రైతుల భూముల నుండి= 9,900 ఎకరాలు
ప్రభుత్వ భూముల నుండి = 6,900 ఎకరాలు, మొత్తం కలిపి 16,800 ఎకరాలు.
33,000 వేల ఎకరాలు రైతుల భూముల నుండి రైతుల వాటా, రహదారులకు కలిపి మొత్తం 16,500 ఎకరాలు తీసివేస్తే ఇంకా రాజధానికోసం మిగిలిన భూమి 16,500 ఎకరాలు.
ప్రభుత్వ భూమిలో రహదారులకు 6,900 ఎకరాలు పోగా ఇంకా మిగిలిన భూమి 16,100 ఎకరాలు.
అంటే రైతుల భూములు, ప్రభుత్వ భూములలో రైతు వాటా, రహదారుల వాటా మినహాయించగా ఇంకా మిగిలిన భూమి 16,500+16,100 = 32,600 ఎకరాలు.

ఇందులో ప్రభుత్వ భూమి 16,100 ఎకరాలు కేవలం ప్రభుత్వ అవసరాలకు తప్ప మరే ఇతర లావాదేవీలకు ఉపయోగించరాదు. కానీ రైతులనుండి సేకరించిన భూమిలో వారివాటా పోగా, మిగులు భూమి 16,500 ఎకరాలు ప్రభుత్వం ఎలాగైనా వినియోగించు కోవచ్చు.. అందులో నుండి ఓ 10,000 ఎకరాలు నిధుల సమీకరణ కోసం ఉపయోగించుకొని మిగిలిన 6,500 యకరాలు + 16100 యకరాలు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 22,600 ఎకరాలలో మనం అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవచ్చు.

నేను పైన చెప్పినట్టు నిధుల సమీకరణకోసం ఉంచిన ప్రభుత్వ భూములు కాని, ఆ 10,000 ఎకరాలను, ఆయన అద్భుతంగా నిర్మించ తలపెట్టిన రాజధాని మధ్యలో గజం దాదాపుగా 60,000/- నుండి 80,000/- వరకు ధర పలుకుతుంది. కానీ కనీస ధర 25,000/- గజం గా నిర్ణయించుకున్నా కూడా ఎంత నిధులు సమీకరించుకోవచ్చో తెలుసా? రమా రమి 1,21,250 కోట్లు (ఒక లక్షా ఇరవై ఒక్క వేల రెండువందల యాభై కోట్లు) ఇంత సొమ్ముతో రాజధాని అమరావతి ని బాబుగారు చెప్పినట్టు సింగపూర్, జపాన్ లను తలదన్నే రీతిలో నిర్మించుకోవచ్చు.

babu-spedsమీకందరికీ మరో అనుమానం రావచ్చు మరి ఇన్ని సంవత్సరాలు బాబుగారు ఈ ప్రణాళిక ఎందుకు అమలు చేయలేదని.దానికి కూడా నా సమాధానం…
ముందు ఆ మొత్తం 56,000 ఎకరాలలోను రహదారులను నిర్మించకుండా ఏ పనీ ప్రారంభించలేము, అందుకోసం మనవద్ద సరిపడా నిధులు లేవు, మోడీ ప్రభుత్వం కూడా సహకరించలేదు, పైగా జగన్ రెడ్డి మూలంగా ప్రజలకు ఉచిత పధకాలు తప్పక చేయవలసిన స్ధితి, కాస్తో కూస్తో ఉన్న నిధులు వాటికి సరిపోయాయి, మరో సారి మనం అధికారం ఇచ్చి ఉంటే దార్శనికుడు సంపద సృష్టికర్త ఇవన్నీ కార్యరూపం చేసి చూపేవాడు.

దీనంతటికీ ప్రత్యక్ష సాక్ష్యం రైతులకు ఎకరానికి వారికి అందిన 1000 గజాలనే గజం 40,000 చొప్పున 4 కోట్లకు అమ్ముకున్నారు. రాజధాని అమరావతి కనీస రూపం రాకుండానే, వారికి అంత ధర పలికితే మరి అమరావతి విశ్వరూపం కనపడితే గజం 1,50,000/- కూడా పలికేది.
ఇదీ ఆ దార్శనికుడు రాజధాని కోసం సాకారం చేసుకోవాలనుకున్న కల.జై అమరావతి

– చైతన్య

Leave a Reply