Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ బడ్జెట్‌లో ఆ మూడింటినీ మరువద్దు

– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్

మొదట రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపులోకి తేవడానికి అదనపు పన్నులు వేయకుండా, రెవిన్యూ లీకేజీ అరికట్టడానికి చర్యలు మరియు స్తూల రాష్ట్ర ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశాల పై దృష్టి పెట్టడం అవసరం. దీన్ని వల్ల రాష్ట్రానికి అదనపు అప్పుల భారం తగ్గుతుంది. రాష్ట్రానికి భవిష్యత్తు ఆదాయం సృష్టించే, ఉత్పాదక ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయం లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రంలో పాలన అవసరం.

రెండు, హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర బడ్జెట్ లో ఆమరావతికి కేటాయింపులు చేసి, సీఆర్డీఏ చట్టంలోని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని 2022-23 బడ్జెట్లో స్పష్టత ఇచ్చింది. సీఎం జగన్ విపరీత ప్రతికూల ధోరణితో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం వెనుకంజలో ఉంది, దీనికి కారణం పాలనలోకి రాగానే, అమరావతి నిర్వీర్యం, పీపీఏ ల రద్దు, రివర్స్ టెండర్ ప్రక్రియతో పారిశ్రామిక వేత్తలు ఖంగుతిన్నారు.

రాష్ట్రంలో అధ్వాన పారిశ్రామిక వాతావరణం వల్ల, అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశంలో 90 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, అందులో ఏపీ వాటా 0.61% మాత్రమే. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 3.20 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, అందులో ఏపీ వాటా 1.20 వేల కోట్లు మాత్రమే. దేశంలో ఏఫ్డీఏ ల ఆకర్షణలో మొదటి 5 స్థానాల్లో ఉండాల్సిన ఏపీ చిట్ట చివరి స్థానల్లో ఉండడం దౌర్బాగ్యస్థితి. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పాలన ఆకృత్యాలకు చరమగీతం పాడి, దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది.

మూడు. నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం పథకాలకు, ప్రాజెక్టులకు సకాలంలో డీపీఆర్ లు పంపి, మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేసే విధంగా నిధులు సమకూర్చు కోవాలి. రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రారంభించాలి.
ప్రత్యేకంగా, ప్రకాశం జిల్లాని గతంలో నిర్లక్ష్యం చేసిన విధంగా కాకుండా, రామాయ పట్నం నౌకాశ్రయం, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక వాడ, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి.

LEAVE A RESPONSE