– వేలంలో టీజీఐఐసీ సరికొత్త రికార్డు
హైదరాబాద్: రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి రూ. 177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున 7.6 ఎకరాలను దక్కించుకుంది. మొత్తం రూ. 1,357 కోట్లకు ఈ భూమిని సొంతం చేసుకుంది.