Suryaa.co.in

Andhra Pradesh

జూన్‌ కల్లా ఆనందపురం-అనకాపల్లి హైవే రెడీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌ నాటికి ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి మధ్య నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2527 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 50 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ఆరు వరసల జాతీయ రహదారి 2019 ఏప్రిల్‌లో ప్రారంభమైనట్లు చెప్పారు. వాస్తవానికి ఈ రహదారి నిర్మాణం 2021 జూలై నాటికి పూర్తి కావలసి ఉన్నప్పటికీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని అయితే దీని వలన ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశం లేదని తెలిపారు.

LEAVE A RESPONSE