– మూడు మండలాల పరిస్థితిని వివరించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
– జిల్లా కలెక్టర్ ఆనంద్ తో మర్యాదపూర్వక భేటీ
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆనంద్ ఐఏఎస్ తో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల సమస్యలను వివరించారు. ఇటీవల పెండింగ్ లో ఉన్న పనుల గురించి కూడా కలెక్టర్ కు తెలిపారు హంద్రీనీవా ద్వారా నీరు అందించాల్సిన ప్రాంతాల గురించి, ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు వంటి వాటి గురించి కలెక్టర్ తో చర్చించారు. అన్ని అంశాల మీద కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే సునీత కలెక్టర్ ని కోరారు..