లండన్: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో లండన్లో భేటీ అయ్యారు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్కు వెళ్తున్న భారత ప్రతినిధుల గౌరవార్థం యూకేలోని భారత హైకమిషనర్ అక్టోబర్ 6వ తేదీన లండన్లోని ఇండియా హౌస్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పాల్గొన్నారు. అనంతరం, 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉదయం లండన్ నుండి బ్రిడ్జ్టౌన్కు బయలుదేరి వెళ్లారు.