Suryaa.co.in

Andhra Pradesh

విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వానికి దోమ కుట్టినట్టైనా లేదు

– రాష్ట్రంలో చెత్తపేరుకుపోయి, దోమలబెడద ఎక్కువైంది
– పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, ఆరోగ్యంతో పాటు, ఆస్తులను పోగొట్టుకుంటున్న వైద్యారోగ్యశాఖ మంత్రిలో చలనం లేదు
– రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ విధించాలి
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
ఆంధ్రప్రదేశ్ లో చెత్త పరిపాలన సాగుతోందని చెప్పడానికి అనేక ఉదంతాలున్నాయని, రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్ తో నిండిపో యిందని, ఇటువంటిస్థితిలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, ఇతర విషజ్వరాలతో ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారని, జ్వరాల బారినపడినవారి గణాంకాలు తెలుసుకునే స్థితిలోకూడా, ఈ ప్రభుత్వంలేదని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు తెలిపా రు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…
మంత్రులు వారివారిశాఖలు నిర్వహిస్తున్నారా అన్న సందేహం ప్రజలందరిలోనూ ఉంది. కేబినెట్ లో ముగ్గురునానీలుఉన్నారు. ఒక నానీఏమో తనకులాన్ని తానే కించపరుచుకునే పనిలోఉన్నా డు. మరో నానీ ఏమో బూతులవిశ్వవిద్యాలయం స్థాపించి దాన్ని దిగ్విజయంగా నడిపే పనిలో నిమగ్నమైపోయాడు, ప్రజలసమస్య లను ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతిసారీ వాటిని దారిమళ్లించే క్రమంలో ఆయన బూతులు మొదలెడతాడు. మరో మంత్రి ఆళ్లనాని. అతను రాష్ట్రంలోఉన్నాడో లేడోకూడా తెలియడంలేదు. నానీ అనే పేరు అమాయకంగా ఉందని వారికి మంత్రిపదవులిచ్చారేమో అని పిస్తోంది. ముగ్గురు నానీల శాఖలేమిటని ప్రజలనుఅడిగితే సమా ధానంచెప్పలేరు, ఎందుకంటే ఎవరు ఏశాఖ నిర్వహిస్తున్నారో వారికే తెలియదుకాబట్టి. రాష్ట్రంలో ప్రజలు రోగాలు, జ్వరాల బారిన పడుతుంటే, రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి దానిగురించి ఏమైనా ఆలోచించారా? నిన్నటివరకు ప్రజలంతా కరోనా భయపడి, చస్తూ బతికారు.
ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడి, వారి దైనందిన కార్య క్రమాలు, పనుల్లో నిమగ్నమైతే, జ్వరాలు, రోగాలు పట్టిపీడిస్తు న్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినారోడ్లపై, కాలువల్లో చెత్త పేరుకు పోతోంది. దాంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి, ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఇంతజరుగుతున్నా వైద్యసిబ్బంది, పారిశుధ్యసిబ్బంది ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పనిలేని కంపెనీకి పెద్దజీతగాడి మాదిరి వైద్యఆరోగ్యశాఖ మంత్రి తయారయ్యారు. గతంలో ఏలూరులో తాగునీరు కలుషితమై, అనేకమంది ప్రాణాలపైకి వచ్చినా తనసొంతనియోజకవర్గంలో జరిగిన దారుణంపైకూడా ఆళ్లనానీ స్పందించలేదు.
గతంలో టీడీపీ ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి, వాటి ని నిర్మూలించడం చేస్తే, ఈ దిక్కుమాలినప్రభుత్వంలోని మంత్రు లు దాన్ని అవహేళనచేశారు. రాష్ట్రంలో ఉదయం 4గంటలకే పారి శుధ్య సిబ్బంది పనులు మొదలెట్టేలా చేసినఘనత టీడీపీప్రభు త్వానిది. ఏరోజుకు ఆరోజు సేకరించినచెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం,దానినుంచి సంపద సృష్టించే పనులను టీడీపీప్రభు త్వం నిర్విఘ్నంగా కొనసాగించింది. పారిశుధ్యసిబ్బందికి అవసర మైన సామగ్రి, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు వారికి అందించ డంజరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో కరోనా సమయంలోకూడా పారి శుధ్యసిబ్బందిని, వారిసేవలను గుర్తించిందిలేదు. జ్వరాలు, రోగాల బారినపడినప్రజలకు గ్రామాల్లోసరైన వైద్యం అందడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులకువెళితే, వారినుంచి వేలరూపాయలు వసూ లుచేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలబారినపడిన ప్రజలు ఆరోగ్యంతోపాటు, ఆస్తులను కోల్పోతు న్నా ఈప్రభుత్వంలో చలనంలేదు. పేదల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి దుర్భరస్థితి రాష్ట్రమంతా ఉన్నా, జగన్ ప్రభుత్వం గానీ, ఆయన కేబినెట్ గానీ ఏమీ పట్ట్టించుకోకుండా నిద్రావస్థలో జోగుతోంది. టీడీపీప్రభుత్వం గతంలో నిర్వహించిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా పనికిమాలిన మంత్రి బుగ్గన హేళనచేశాడు. అదేమంత్రి ఇప్పుడు బయటకువచ్చి, దోమలతో కుట్టించుకుంటే, వాటిదెబ్బఎలాఉంటుందో తెలిసొస్తుంది. అధికారంలో ఉండి ఎలా పని చేయాలో, ప్రజలను ఎలా కాపాడాలో, రాష్ట్రాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచాలో తెలియదుకానీ, ఆపనులన్నీ సక్రమంగా చేసినవారిని తప్పుపట్టడం, ఎగతాళిచేయడం మాత్రం తెలుసు.
జగన్ ప్రభుత్వం ఏపథకం అమలుచేసినా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి జేబులునింపేలా ఉండాలితప్ప, ప్రజల కు మేలుచేసేలా ఉండకూడదు. ఈ మంత్రులు చెత్తలో పుట్టిన దోమలకన్నా ప్రమాదకరంగా తయారయ్యారు. గంజాయి, మలేరియా, డెంగ్యూకంటే రాష్ట్రమంత్రులేప్రమాదకారులని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే వారిప్రవర్తన, వ్యవహారశైలి, హావభావాలు అలా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది. దానిస్థానంలో గంజాయి, మట్కా, గుట్కా, ఇతరమాదకద్రవ్యాలు వచ్చిచేరాయి. అన్నపూర్ణగా పిలవ బడే ఆంధ్రప్రదేశ్ ను మత్తుప్రదేశ్, మాదకద్రవ్యాల ఖిల్లాగా జగన్ ప్రభుత్వం మార్చేసింది. దోమలుఎలాగైతే వాటిసంతతిని వృద్ధిచే సుకొని ప్రజలరక్తాన్ని ఎలా పీలుస్తాయో, వాటికంటే పదిరెట్లు అధికంగా ఏపీ మంత్రులు ప్రజలరక్తాన్ని పీలుస్తూ, తమఖజానా నింపుకుంటుంటే, ముఖ్యమంత్రి వారిని ప్రోత్సహిస్తున్నాడు. డెంగ్యూ , మలేరియా, ఇతరవిషజ్వరాల వ్యాప్తిలో ఏపీ దేశంలోనే అన్నిరాష్ట్రాలకంటే ముందుంది. ఈ ప్రభుత్వతీరు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎటువంటిచర్యలు తీసు కుంటున్నారో, తీసుకున్నారోచెప్పాలి. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి. వైద్యారోగ్యశాఖ పరిధిలో ప్రజారోగ్యం కోసం ఈప్రభుత్వం ఏంచేసిందో, ఏంచేయబోతోందో, వివరిస్తూ పూర్తి వివరాలతో మంత్రి ఆళ్లనాని తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాల ని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE