Suryaa.co.in

Andhra Pradesh Telangana

హైదరాబాద్ లో గిగ్ వర్కర్లుగా ఆంధ్రా యువత

– రాహుల్‌గాంధీతో భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్లు అంటే.. డెలివరీ బాయ్స్, ఈ కామర్స్ డెలివరీలు వంటి పనులు చేసే వారు. బైక్ ట్యాక్సీలను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. వీరిలో అత్యధిక మంది తము ఏపీ నుంచి వచ్చామని.. అక్కడ ఉద్యోగావకాశాలు , ఉపాధి లేవని వివరించారు. అప్పుడే ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత దుస్థితి బయటపడింది.

హైదరాబాద్ లో ఏ సెంటర్ కైనా వెళ్లండి.. బైక్ ట్యాక్సీ బుక్ చేయండి వచ్చేది ఖచ్చితంగా ఆంధ్రా నుంచి వలస వచ్చిన ఓ నిరుద్యోగి. ఎలాగోలా ఎంతో కొంత తన బైక్ ట్యాక్సీగా వాడుకుని బతుకుదామని వచ్చిన వారే. డెలివరి బాయ్స్ లో అత్యధిక ఆంధ్రా వాళ్లే. ఇలాంటి గిగ్ వర్కర్లుగా లక్షల మంది యువత హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఎందుకు ఇలా హైదరాబాద్ చేరాల్సి వచ్చింది.. గిగ్ వర్కర్లుగా ఎందుకు స్థిరపడాల్సి వస్తోందంటే… దానికి కారణం సులువుగానే అర్థమవుతుంది.

ఏపీలో యువ శక్తిని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వారికి ఉపాధి అక్కర్లేదని ఐదు వేలు ఇస్తే చాలన్నట్లుగా మార్చింది. ఉపాధి అవకాశాల్ని నిర్వీర్యం చేసింది. అనేక పరిశ్రమల్ని వెళ్లగొట్టింది. అమరావతికి రావాల్సిన కొన్ని వందల కంపెనీలను వెళ్లగొట్టారు. గత ఐదేళ్లు ఏపీ యువతకు డిజాస్టర్ గా మారింది. హైదరాబాద్, బెంగళూరులో గిగ్ వర్కర్లుగా యువత భవిష్యత్ పరిమితమవుతోంది.

LEAVE A RESPONSE