నాటుసారా త్రాగి చనిపోయినవారివన్నీ ప్రభుత్వ హత్యలే

-మద్యపాన నిషేదం అమలు చేసి ఉంటే ఇంతమంది మహిళల మంగళ సూత్రాలు తెగేవా?
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధన దాహంతో రాష్ట్రంలో మద్యం, నాటు సారా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ప.గో జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి రెండు రోజుల వ్యవధిలోనే 15 మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ‎ఓ వైపు కమీషన్ల కోసం కక్కుర్తి పడి జగన్ రెడ్డి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయిస్తూ, మరో వైపు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాటు సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాసిరకం మద్యం, నాటు సారా తాగి అనేక మంది చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం జగన్ రెడ్డి కాదా? జగన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేదం అమలు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవా? ఇంతమంది మహిళల మంగళ సూత్రాలు తెగేవా? ‎ ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదా?

నాటు సారా తాగి మరణించిన వారి కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో నాసిరకం మద్యం, నాటుసారా విక్రయాలని అరికట్టాలి. మద్యపాన నిషేదం ఎప్పుడు అమలు చేస్తారో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.

Leave a Reply