మాయలమరాటీ బడ్జెట్

– పేదలపై మరింతగా పన్నులభారం మోపారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేది.. రాష్ట్రానికి ఆదాయంపెంచేది.. ఆ ఆదాయాన్ని ప్రజలసంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేలా చేసేది రాష్ట్రరాజధాని అమరావతే. అలాంటి అమరావతిని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాశనంచేసేశాడు. మూడురాజధాను ల పేరుతో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చినరైతులు 800రోజులకుపైగా రోడ్లపైనే పడిఏడుస్తున్నారు.

మొన్నటికి మొన్న రాష్ట్రఅత్యున్నత న్యాయ స్థానం అమరావతి నిర్మాణంసహా, రైతులకు ప్రభుత్వంచేయాల్సిన వన్నీ చేయాల్సిందేనని స్పష్టమైన తీర్పుఇచ్చింది. గతప్రభుత్వం అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను ఈ ప్రభుత్వం పూర్తిచేయాల ని..అలానేరైతులకు ఇస్తామన్న నివాస, వాణిజ్య ప్లాట్లను వెంటనే వారికి ఇవ్వాలని హైకోర్ట్ తేల్చిచెప్పింది.గతప్రభుత్వం ప్రారంభించి ని నిర్మాణాలను, రోడ్లను వెంటనే పూర్తిచేయాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వసంస్థలు ఏవైతే నిర్మాణంలోఉండి ఆగిపోయాయో..వాటిని కూడాపూర్తిచేయాలని హైకోర్ట్ చెబితే, నేడుప్రభుత్వంప్రకటించిన బడ్జెట్లో ఎక్కడా అమరావతి అన్నపేరే వినపడలేదు.

6 నెలల్లో అమరావతిలోని నిర్మాణాలుఅన్నీపూర్తిచేయాలని సాక్షాత్తూ న్యా యస్థానమేచెప్పినా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా అమరావతి అభివృద్ధికి కేటాయించలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంద్వారా కోర్టుఆదేశాలను ఈ ప్రభుత్వం ధిక్కరించిందనే చెప్పాలి. జగన్ రెడ్డిప్రభుత్వానికి సిగ్గు, శరం లేవని తాజా బడ్జెట్ లో అమరావతికి చేసిన కేటాయింపులే చెబుతున్నాయి. అమరావతికి నిధులుఎందుకు కేటాయించలేద ని రేపు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము. సంక్షేమం అనేది ఈప్రభుత్వంలో గుండుసున్నాగా మారింది. ఇప్పటివరకు నాలుగుబడ్జెట్లు పెట్టిన వైసీపీప్రభుత్వం, ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కబీసీ సోదరుడికైనా రూపాయి రుణమిచ్చిందా అని ప్రశ్నిస్తున్నా?

అలానే ఎస్టీలు,ఎస్సీలు, మైనారిటీసోదరుల్లో ఎందరికి ఎంతమొత్తంలో రుణాలు ఇచ్చారో పాలకులుచెప్పగలరా? ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే కాకుండాఇతరవర్గాల్లోని పేదవారికి ఎవరికైనా స్వయంఉపాధిరుణం కింద రూపాయైనా సాయం చేశా రా? విదేశాల్లో చదువుకుంటున్న పేదవిద్యార్థులకు ఏ ఒక్కబడ్జెట్ లో అయినా రూపాయి ఇవ్వలేదు. బడ్జెట్ పేరుతోసంక్షేమజపం చేస్తున్న జగన్ రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన నిత్యంప్రజలకోసం అమలుచేసేపథకాలనే సంక్షేమలెక్కల్లో చెబుతున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శించే ఆర్థికమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం.

రాజ్యాంగంప్రకారం దళితులు, బీసీలకు కొన్ని ప్రత్యేకకేటాయింపు లు చేయాలి.. అలాంటి కేటాయింపులుచేయకుండా వారిని కూడా అందరిపౌరులలెక్కలోనే చూపారు. టీడీపీహాయాంలో బీసీలు, ఎస్సీ,ఎస్టీలు, మైనారిటీలకు ప్రత్యేకంగాఎన్నినిధులు కేటాయించా మో, ఎంతమొత్తం ఖర్చుపెట్టామో స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పగలం. అలా ఈప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ చెప్పగలరా ? ఈ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అంతాగారడీనే. ఇదొక మాయలమరాటీ బడ్జెట్ అనిచెప్పడంలోఎలాంటి సందేహంలేదు.

తమ బాధ్యతగా తామేంచేయాలో… రేపు శాసనసభలో ఈప్రభుత్వా న్ని ఎలా నిలదీయాలో అదంతాచేస్తాం. ప్రభుత్వమోసాన్ని ఎండగ ట్టి ప్రజలకు మేలుచేసేవరకు పోరాడతాం. ఈబడ్జెట్ పేదలపై మరిం త పన్నులు మోపిందనే చెప్పాలి.

Leave a Reply