Suryaa.co.in

Telangana

అంగరంగ వైభవంగా వారాసిగూడ జాన్సన్ గ్రామర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్: బౌద్ధ నగర్ శాఖ వారాసిగూడ జాన్సన్ గ్రామర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తార్నాక రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు .ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పి.విశ్వప్రసాద్, ఐ.పి. ఎస్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ , ట్రాఫిక్ , కొరియో గ్రాఫర్ యానీ మాస్టర్, మరియు కార్పోరేటర్ సామల హేమ డి . సరస్వతి రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ,విద్యార్థులచే ప్రదర్శించబడిన నైతిక విలువలను ప్రభోదిస్తూ రూపొందించిన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను (వీక్షకులను)ఆకట్టుకున్నాయి. .ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీహరి, ప్రవీణ , రోహణ్ బాసబోయిన మరియు ప్రధానోపాధ్యాయులు వీణ, కోఆర్డినేటర్ పుష్ప, పాఠశాల సిబ్బంది ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE