ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

బార్‌ఘర్: దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ రైలు దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. బర్గర్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలు 5 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.