Suryaa.co.in

Andhra Pradesh

జవాబు చెప్పండి జగన్ గారూ..

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

టమోటా అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉంటే ..అన్నదాతలని ఆదుకుంటానంటూ మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారు?
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే అన్నింటికీ జిందా తిలిస్మాత్ లా పనిచేస్తాయని చెప్పిన జగన్ నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి?

విత్తనం నుంచి విక్రయం వరకూ అన్నదాతకు అన్యాయం చేయడమేనా ముఖ్యమంత్రి గారూ మీరు తీసుకొచ్చిన రైతు రాజ్యం? మీరు పెట్టిన 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా? టమోటా రైతులకి మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచడానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజ్లులు ఏవీ? టమోటా ఎక్కువగా పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా టమోటా పేస్ట్, సాస్, కెచప్ తయారీ అంటూ ఊరించినవి ఉత్తుత్తి కోతలేనా?

LEAVE A RESPONSE