వేరే రాష్ట్రంలో కేసైనా ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చు: సుప్రీం

నిందితులకు ముందస్తు బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేరే రాష్ట్రంలో కేసు నమోదైనా.. హైకోర్టు, సెషన్స్ కోర్టులు బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసింది. న్యాయ ప్రయోజనాల కోణంలో ఈ వెసులుబాటుకు వీలుంటుందని తెలిపింది. ‘ప్రియ ఇందోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

Leave a Reply