సజ్జల.. మళ్ళీ అవే కాకమ్మ కబుర్లు

Spread the love
  • అరగంట మంత్రిని ఏమి చేసింది మీ పార్టీ?
  • గంట అన్న వాడిని మంత్రి పదవి ఇచ్చి సత్కరించింది
  • నీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఎంపీ విజయసాయి మీద ఎంక్వైరీ వెయ్యవా?
  • నీ లేని దిశ చట్టం అధికారులు తేల్చారా? వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారు?
  • మీరు ఇలాగే వెధవల్ని అందర్నీ వెనకేసుకు రండి, మహిళా శక్తి ఏంటో మేము మీకు చూపిస్తాం
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ

సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్ సజ్జల ఇంకా రాలేదు ఏమిటా అనుకుంటున్నాం.. అంతలోనే వచ్చేశాడు. వచ్చేశాడు అనాలో జగన్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చెయ్యమని పంపించాడో తెలీదు. మొత్తానికి వచ్చేశాడు. వచ్చి మళ్ళీ అవే కాకమ్మ కబుర్లు.. అరగంట మంత్రిని ఏమి చేసింది మీ పార్టీ? గంట అన్న వాడిని మంత్రి పదవి ఇచ్చి సత్కరించింది. వాళ్ళ లేకి భాగోతాలు బయట పడ్డ నాడే చర్యలు తీసుకొని ఉంటే నేడు ఇలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉండేది కాదు.

ఇంకా సిగ్గు లేకుండా వీడియో నిజమో కాదో తేలాల్సి ఉంది అంటావా? మీ విషపుత్రిక సాక్షిలో పొద్దున్నే “నకిలీ వీడియో” అని వేయించి, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సత్య హరిశ్చంద్రుడు తమ్ముడు మాదిరి డ్రామాలు. ఎంక్వైరీ లో నిజాలు తేలుతాయా? ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? సోషల్ మీడియా వేదికగా నిన్న మొన్న ఎన్టీఆర్ బిడ్డపై కారుకూతలు కూసిన నీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఎంపీ విజయసాయి మీద ఎంక్వైరీ వెయ్యవా? మహిళల గురించి నోటికొచ్చింది కూయడానికి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి పంపారా?

గతంలో అంబటి గంట ఆడియో మీద ఎంక్వైరీ కూడా నువ్వే చేయించావా? అంబటి, అవంతి నిర్దోషులుగా నువ్వే తేల్చావా? నీ లేని దిశ చట్టం అధికారులు తేల్చారా? వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఈ ఎంపీ మీద చర్యలు తీసుకోవడానికి? మీరు ఇలాగే వెధవల్ని అందర్నీ వెనకేసుకు రండి, మహిళా శక్తి ఏంటో రేపు మేము మీకు చూపిస్తాం. తక్షణమే ఈ ఎంపీని మీ పార్టీ నుండి బయటకు పంపి, ఎంపీ పదవికి రాజీనామా చేయించి, మళ్ళీ మీ పార్టీకి చెందిన ఏ రాజకీయ వేదిక మీదా కనబడకుండా చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీగా మీపై ఉంది.

Leave a Reply