కుప్పం వైసీపీ కార్యకర్తలకు ఏమి సందేశం ఇస్తారు జగన్ రెడ్డి?

-జగన్‌కు తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత ప్రశ్న

స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైవ్ లో దొరికిపోయిన MP పై ఏ చర్యలు తీసుకోకుండా, కుప్పం వైసీపీ కార్యకర్తలకు ఏమి సందేశం ఇస్తారు జగన్ రెడ్డి? ఇదిగో మన ఎంపీ ఘనకార్యం, ప్రత్యేక హోదా లేదు, పరిశ్రమలు లేవు, మన ఎంపీ నీలి వీడియో చూసి తరించండి అని ఆ చెత్త వీడియో ప్రదర్శిస్తారా కార్యకర్తలకు?