కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ ఏదీ?

– విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి మురళీధర్ రావు

మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పై చేసిన వ్యాఖ్యలపై మురళీధర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటూ … ఎటుపడితే అటు మాట్లాడుతున్నడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 70 రోజులు గడిచినా ఎందుకు విచారణ జర పడం లేదు?

ప్రభుత్వంలో మీరున్నారు. పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు జరపాలి అని కేంద్ర ప్రభుత్వం కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయాలి. లేదంటే రాజీనామా చేసి బయటకు రా? మీకు సత్తా లేకపోతే, దర్యాప్తు చేయలేకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజల పైసలు తిన్న దొంగలను జైలుకు పంపలేకపోతే.. మీకు నైతిక అధికారం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అగ్గిలో నిలబెడుతుందని హెచ్చరిస్తున్నాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానన్నడు. డబుల్ లేదు.. సింగిల్ లేదు.

గత బీఆర్ఎస్ సర్కారు మహేశ్వరంలో ముస్లింలకే డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కులమతాలకు అతీతంగా ఇండ్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించారు. అవినీతి మరక లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు తావివ్వకుండా, సొంత ఆస్తులు పెంచుకోకుండా నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేండ్ల పాలనలో 13 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లను నిర్మించింది. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకొచ్చింది. మహిళలను కట్టెల పొయ్యి పొగబారి నుంచి విముక్తి కలిగించేలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించింది.

500 ఏండ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున తెలంగాణలో సెలవు ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం.. ముస్లిం దేశాల్లో కూడా సెలవు ఇవ్వని షబ్-ఎ-మెరాజ్ పండుగకు మాత్రం మన రాష్ట్రంలో సెలవు ప్రకటించింది.

Leave a Reply