Suryaa.co.in

Andhra Pradesh

భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుంది

-అయోధ్య లో రామాలయం నిర్మాణం బిజెపి కల
-దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ
-ప్రత్యేక రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
-అయోధ్య లోని భవ్యమైన రామ మందిరం-దివ్యమైన బాలరాముని దర్శనార్థం గుంటూరు నుంచి బయలుదేరిన రామ భక్తులతో కూడిన అయోధ్య ప్రత్యేక రైలు
-జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన గుంటూరు రైల్వేస్టేషన్
-రామ భక్తులతో కిక్కిరిసిన గుంటూరు రైల్వే స్టేషన్
-రైల్వే స్టేషన్ లో కదం తొక్కిన రామదండు (రామ భక్తులు)

గుంటూరు నుంచి రామ భక్తులతో అయోధ్యకు వెళుతున్న ప్రత్యేక రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్, శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామిజీ.

బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి :
ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇది. భక్తులు ఇలా తండోపతండాలుగా బాలరాముని దర్శనం కోసం వెళుతుంటే చూడాలని మాత్రమే వచ్చాను. 500 సం.ల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట జరగడం చూస్తే ఆనందంగా ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు మరలా పునర్ వైభవం సంతరించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ త్యాగఫలితం. సనాతన భారతీయ సంస్కృతిలో రాముడు అనే వ్యక్తి హిందువులకు ఆరాధ్యదైవం.

500 సం.రాల పోరాటం నాలుగున్నర లక్షల ప్రాణత్యాగమే అయోధ్య బాలరాముని ప్రతిష్టకు మోడీ చేతుల మీదుగా జరగడం చూస్తే ఆనందం కలుగుతుంది. వేలాది మంది భక్తులను అయోధ్య కు పంపిస్తున్న పుణ్యం ఏపీ కి దక్కుతుంది. శ్రీరాముని చల్లని చూపు ఏపీ పై ఉండాలి.

అయోధ్య లో రాముని చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయోధ్య లో రామాలయం నిర్మాణం బిజెపి కల . దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ. ఎన్నో జన్మల పుణ్యఫలంతో ప్రధాని నరేంద్రమోదీ ఈ ఆలయం నిర్మించగలిగారు..

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ , జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రామకృష్ణారెడ్డి, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ, భీమినేని చంద్రశేఖర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, నూతలపాటి బాల, కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, వైవీ సుబ్బారావు, కొక్కెర శ్రీనివాస్, వెంకయ్య నాయుడు, పాలపాటి రవికుమార్, నాగమల్లేశ్వరి, దారా అంబేద్కర్, హరిక్రిష్ణ, నరేంద్ర షా, నాగేంద్ర యాదవ్, పాండురంగ విట్ఠల్, దర్శనం శ్రీనివాస్, పద్మనాభం, మంత్రి సుగుణ, ఆవుల రాము, ఏలూరి లక్ష్మీ, సరోజిని, ప్రశాంతి, చంద్రశేఖర్ గుప్తా, రావూరి నారాయణ, రాజేష్ నాయుడు, తాడువాయి రామకృష్ణ, జితేంద్రగుప్త, వెలగలేటి గంగాధర్ మరియు పెద్దయెత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE