తినబోతూ రుచి అడగవద్దు

-ఏం జరగబోతుందో మీరే చూస్తారు
-మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ
-రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి
-షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
-బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాల పై మాకు అవగాహన ఉండదు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు, కొన్ని పరిమితులు ఉంటాయి. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. తినబోతూ రుచి అడగవద్దు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే , మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.

రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుంది… షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు . ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదో ఆమె ఉండే పార్టీ నే అడగాలి.

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి :
పొత్తుల వ్యవహారం బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుంది. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నాం. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుంది.

Leave a Reply