బీజేపీ ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

-ప్రజల పైన పన్నులు వేసి ఆ డబ్బు నే 6 గ్యారెంటీ ల పేరు తో ప్రజలకు పంచుతారా చెప్పాలి
-ఈ బడ్జెట్ లో ఎంత డబ్బు కేటాయిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాలి
-ప్రాజెక్టుల ను పూర్తి చేయడం కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ప్రకటించాలి
-ఉచిత విద్యుత్ పథకం ఎలా అమలు చేస్తుంది?
-ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారు?
-బీజేపీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గ్యారంటీ ల అమలుకు కార్యాచరణ ప్రణాళికను బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. 6 గ్యారెంటీ ల పేరుతో ఇచ్చిన అనేక హామీల అమలుకు లబ్ది దారులు ఎంత మంది అవుతున్నారు.? ఎంత ఖర్చు అవుతుంది? ఈ బడ్జెట్ లో ఎంత డబ్బు కేటాయిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించాలి .

6 గ్యారెంటీ ల అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో చెప్పాలి? కొత్త ఆదాయ మార్గాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపోతం చేస్తారా? అప్పుల రాష్ట్రం లో అధికారం లోకి రావడానికి అలవి కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిన మీరు మళ్లీ అప్పులు చేసి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? ప్రజల పైన పన్నులు వేసి ఆ డబ్బు నే 6 గ్యారెంటీ ల పేరు తో ప్రజలకు పంచుతారా చెప్పాలి. వెంటనే అమలు చేయాల్సిన పెన్షన్ లాంటి స్కీములు 61 రోజులైనా అమలు కావడం లేదు. యాసంగి పంట కోత కు వచ్చే సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పెట్టు బడి సాయంగా ఇచ్చే రైతు భరోసా వూసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

కృష్ణా జలాల పంపిణీ పై సవాల్ చేస్తూ బడ్జెట్ సెషన్ ను పక్క దారి పట్టించుకుంటున్న రేవంత్ రెడ్డి , కృష్ణా నది పై జూరాల నుండి నాగార్జున సాగర్ దాకా ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ SLBC , దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ను పూర్తి చేయడం కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ప్రకటించాలి.

Dec 9th న చేస్తానన్న 2 లక్షల రైతు రుణ మాఫీ విషయం లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నైనా నిధులు కేటాయించి వెంటనే అమలు చేయాలి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మానిఫెస్టో లోనే హామీల అమలు తేదీ లను ప్రకటించిన పార్టీ కి , అధికారం లోకి వచ్చాక ఆ తేదీలు ఎందుకు గుర్తు రావడం లేదు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారెంటీ ల అమలుకు కార్యాచరణ ప్రకటించక పోతే గత పదేళ్లుగా 9 లక్షల కోట్లు తెలంగాణ కు కేటాయించి అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల పక్షాన గ్యారెంటీ ల పేరు తో గారడీ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పైన పోరాటం చేస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చి అలవికాని హామీలిచ్చారు.

ఆరు గ్యారంటీల పేరుతో గారడీ చేసి తెలంగాణ ప్రజలను మాయలో నెట్టేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చి 61 రోజులు గడిచింది. 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీల కథ కంచికే పోయింది తప్పితే.. అమలయ్యే పరిస్థితి కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల అమలు విషయంలో బీజేపీ తరఫున సంధిస్తున్న ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఇస్తామన్నరు.. రూ. 500 గ్యాస్ సిలిండర్ అన్నరు. దీనికి సంబంధించిన బడ్జెట్ అలోకేషన్ గురించి ఎందుకు చెప్పడం లేదు?
రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నరు.

యాసంగి పంట నాట్లు పూర్తయి.. పంట కోతలు కూడా దగ్గరపడ్డయి. కాని, ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకు నెరవేర్చలేదు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. గత పదేళ్ల దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎవ్వరికీ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ఎలా అమలు చేస్తుంది? ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారు..?

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎంతమంది..? ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను ఎట్లా ఆదుకుంటరు? గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో తప్పిదాలేంటి..? సమాధానం చెప్పాలి. ఉద్యమకారులకు స్థలం కేటాయింపు కోసం కాంగ్రస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక కమిటీ వేసింది లేదు. మరి హామీ అమలు ఎలా సాధ్యం?

యువ వికాసం ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డును అందిస్తామన్నారు. యువ వికాసం. మండలానికో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నరు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ ఎంత..? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేస్తారు..? మూసివేసిన పాఠశాలలను ఎలా తెరిపిస్తారు..? సమాధానం చెప్పాలి. చేయూత పథకం విషయంలో తెలంగాణ ప్రజల బతుకు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చేయూత పథకం ద్వారా రూ.4 వేల పింఛన్‌ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అమలుకునోచుకోకపోవడతో వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. మరి, కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీల అమలుకు ఈ పరిస్థితుల్లో ఆర్థిక వనరులను ఎలా సమకూరుస్తుంది..?

6 గ్యారంటీలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు అవుతారనేది అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ విడుదల చేయాలి. రాష్ట్రంలో కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు..? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారనేది సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి తేదీలతో సహా నమోదు చేశారు. కాని చెప్పిన సమయం ప్రకారం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

గత తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేయాలి.ఆరు గ్యారెంటీల లబ్ది దారులు ఎంతమంది ఉన్నారు..? అందుకు అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి.

ఉద్యోగాల కల్పన కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొత్త పంచాయితీ షురూ చేశారు.కృష్ణా బేసిన్ లో నిర్మించే ప్రాజెక్టు లకు ఎన్ని నిధులు కేటాయిస్తారనేది అసెంబ్లీ లో స్పష్టం చేయాలి.

జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎలా పూర్తిచేస్తారనే ప్రణాళికను తెలంగాణ ప్రజల ముందుంచాలి. లేదంటే బీజేపీ ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తుంది

Leave a Reply