– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్
విజయవాడ: ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరద ముప్పు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన అత్యవసరంగా జూమ్ మీటింగ్ లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు మానవతా దృక్పథంతో తోడుగా నిలవాలని సమావేశం తీర్మానించింది.
అందులో భాగంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీల ఒక నెల గౌరవ వేతనం ఏడు కోట్ల 70 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించింది.
త్వరలో రాష్ట్ర కమిటీ నాయకులు వై .వి. బి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి అంగీకార తీర్మాన పత్రాన్ని అందజేయాలని నిర్ణయించింది.