• డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ 1 అంటున్న స్మగ్లింగ్ ఇండియా నివేదికపై జగన్ నోరువిప్పాలి.
• రాష్ట్రంలో 18,267 కిలోల డ్రగ్స్ దొరికాయన్న నివేదిక చెబుతోంది.
• చంద్రబాబుపాలనలో ఏపీకి ఇండస్ట్రీలు వస్తే, జగన్ జమానాలో ఈడీ, ఐటీ, సీబీఐ లు వస్తున్నాయి.
• దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ కాకుండా, అలీబాబా దొంగలముఠాలో పెద్దతలకాయలు చాలాఉన్నాయి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జగన్ రెడ్డి జమానాలో డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్-1 స్థానంలో నిలిచిందని, వైసీపీ ప్రభుత్వహాయాంలో అంతులేనివిధంగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, చంద్రబాబు హాయాం లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలువస్తే, నేడు ఈడీ, ఐటీ, సీబీఐలు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
టీడీపీపాలనలో స్వర్ణాంధ్ర, జగన్ జమానాలో నేరాలు, ఘోరాలు, డ్రగ్సాంధ్ర…
“టీడీపీప్రభుత్వంలో అన్నపూర్ణగా, స్వర్ణాంధ్రగా పిలువబడిన ఆంధ్రప్రదేశ్, జగన్ రెడ్డి పాలనలో నేర,ఘోరాంధ్రప్రదేశ్ గా మారింది. చంద్రబాబుపాలనలో ఇండస్ట్రీలు తీసుకు రావడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, శాంతిభద్రతలరక్షణలో, అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. జగన్ పాలనలో అంతులేని విధంగా క్రైమ్ రేట్ పెరిగింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్రంలో 18,267 కిలోల డ్రగ్స్ దొరికాయని స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక చెబుతోంది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికపై జగన్ రెడ్డి, తన తలఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నిస్తున్నాం. సదరు నివేదికపై ముఖ్యమంత్రి నోరువిప్పాలి. సజ్జలో, మరో బిజ్జలో ఏదో ఊసుపోని కబుర్లు చెబుతామంటే ఊరుకునేదిలేదు. ఏపీ కేంద్రంగా దేశం నలుమూలలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీప్రాంతాన్ని గంజాయి సాగుకు అడ్డాగా మార్చారు. ఉత్తరాంధ్రను గంజా యి డెన్ గామార్చిన ఘనుడు విజయసాయిరెడ్డే.
దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా ఏపీపేరే వినిపిస్తుంటే, జగన్ రెడ్డేమో కలెక్షన్లలో మునిగి తేలుతున్నాడు
విశాఖపట్నం కేంద్రంగా 40వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. ఏ2 సారథ్యంలోని జేగ్యాంగ్, వైసీపీ నేతలే గంజాయి సాగుచేస్తూ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వెళ్లిన 4న్నర కిలోల డ్రగ్స్ పార్శిల్ ఇటీవలే బెంగుళూరులో పట్టుబడింది. గుజరాత్ ముంద్రాపోర్టులో పట్టుబడిన డ్రగ్స్ మూలాలు ఏపీతో లింక్ అయ్యి ఉన్నాయని తేలింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగుళూరు, చెన్నైలో ఎక్కడ డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినా రాష్ట్రం పేరే వినిపిస్తోంది. డబ్బుపిచ్చితో యువతజీవితాలు నాశనంచేస్తూ, వైసీపీనేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు.
కలెక్షన్లపై ఆధారపడిన తాడేపల్లి ప్యాలెస్ కు ప్రజలు, రాష్ట్రంకంటే డబ్బే ముఖ్యమైంది. రాష్ట్రయువత డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతూ, మహిళలు, యువతులపైకి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు బయటకురావాలంటేనే వణికిపోతున్నారు. తక్కెళ్లపాడులో జ్ఞానేశ్వర్, తపస్విని అనే మెడికల్ విద్యార్థినిపై దాడికి తెగించడం దుర్మార్గం. జ్ఞానేశ్వర్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించకుంటే, అతన్ని కూడా ఈ ప్రభు త్వం శిక్షించలేకపోయేది.
ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో కాబోయే భర్తఎదుటే యువతిపై అత్యాచారానికి తెగించిన వెంకటరెడ్డిని ఇంతవరకు శిక్షంచలేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత కాదా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ రెడ్డి సర్వనాశనంచేశారు. ఏపీలోనే మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ స్పష్టంచేసింది. జాతీయ మహిళాకమిషన్ నివేదికపై ఏపీ మహిళాకమిషన్ ఏం చెబుతుంది? లేని దిశాచట్టంతో జగన్ అండ్ కో, వైసీపీ మహిళానేతలు ఉత్తుత్తి ఉపన్యా సాలతో మహిళల్ని వంచిస్తున్నారు.
జే గ్యాంగ్ కుంభకోణాలు, దందాలు, సెటిల్మెంట్లతో పోగేసిన సొమ్ముని పొరుగురాష్ట్రాల్లో దాస్తే, నిఘాసంస్థలు కనిపెట్టలేవా?
సంకల్పసిద్ధి సంస్థ ద్వారా గొలుసుకట్టు పద్ధతిలో అమాయకప్రజలను మోసగించి, కోట్లుకొల్లగొట్టారని అర్థమవుతోంది. సంకల్పసిద్ధి కుంభకోణం సొమ్మేకాదు, రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్ల దందాతో ఏపీలో వైసీపీనేతలు పోగేసిన సొమ్మంతా ఇతరరాష్ట్రాలకే చేరింది. పేదల్ని దోచుకున్నసొమ్ముతో హైదరాబాద్, బెంగుళూరులాంటిచోట్ల వైసీపీనేతలు పెట్టిన పెట్టుబడులు ఐటీ, ఈడీసోదాలద్వారా బయటపడుతున్నాయి. వందలు, లక్షలకోట్లు సంపాదించడానికి వైసీపీనేతల తాతలు, తండ్రులు ఏమైనా పుట్టుకతో జమీందారులా?
ఏం వ్యాపారాలు చేసి కోట్లకుకోట్లు సంపాదిస్తున్నారో చెప్పే ధైర్యం వైసీపీనేతలకు ఉందా? పట్టుబడిన సొమ్ము ఎక్కడినుంచి ఎక్కడికి, ఎవరినుంచి ఎవరికి వెళ్లిందనే వివరాలను దర్యాప్తుసంస్థలు బయటపెట్టాలని కోరుతున్నాం. దేవినేని నెహ్రూకొడుకు, వల్లభనేని వంశీనేకాదు, ఇంకా చాలాపెద్ద బ్యాచ్ ఉంది. అలీబాబా దొంగలముఠాలోని వారు దొరికితే, వారివెనకున్న పెద్దతలకాయలు బయటకువస్తాయి” అని బొండా స్పష్టంచేశారు.