రెండో దశ మెట్రో రైలు లైను ఒక గొప్ప ప్రాజెక్టు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రెండో దశ మెట్రో రైలు లైను ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్ లోని పోలీస్ గ్రౌండ్ లో ఈ నెల 9 వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మెట్రో MD NVS రెడ్డి లు GHMC మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు MLA లు, చైర్మన్ లు, అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సభకు వచ్చే వాహనాల రూట్, పార్కింగ్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి సభ వద్దకు వచ్చే రూట్, బందోబస్తు ఏర్పాట్లను పోలీసు అధికారులు వివరించారు. అనంతరం మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంఖుస్థాపన శిలాఫలకం ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలోimage-3 మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీన ఉదయం 10.గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైలు లైన్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం అక్కడి నుండి రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్ కు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి KTR ఆధ్వర్యంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, లింక్ రోడ్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలోని అనేక నగరాలతో హైదరాబాద్ అభివృద్ధి లో పోటీ పడుతుందని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. మెట్రో రైలు సౌకర్యం హైదరాబాద్ నగర కలల ప్రాజెక్టు అని, రెండో దశ కోసం ఎదురు చూస్తున్న ప్రజల కల త్వరలోనే సాకారం కాబోతుందని ప్రకటించారు.

ఇప్పటికే 63 కిలోమీటర్ల మేర మొదటి దశలో మెట్రో రైలు సేవలు అందుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు ౩౦ కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. కాలుష్య రహిత ప్రయాణం, తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకొనేందుకు మెట్రో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. రెండో దశ ప్రాజెక్టు తో IT కారిడార్ తో పాటు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ప్రయాణీకులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అంతటి గొప్ప ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కి ఘనస్వాగతం పలకనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం లో MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, MP రంజిత్ రెడ్డి, MLA లు మాగంటి గోపినాద్, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, జైపాల్ యాదవ్, కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, MLC శంబీపూర్ రాజు, ZP చైర్మన్ అనిత, కార్పోరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర, పోలీసు అధికారులు శిల్పవల్లి, శ్రీనివాసరావు, TRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జి లు ఆనంద్ గౌడ్, సలా ఉద్దిన్ లోది, జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply