Suryaa.co.in

Telangana

తెలంగాణలో 24 గంటల కరెంటుపై చర్చకు సిద్దమా?

-వందే భారత్ ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?
-తెలంగాణ ఏర్పాటు ను అవమానించిన మోడీ కి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
-ఈ మాత్రం దానికి హైదరాబాద్ వచ్చి తిట్టాలా..ఢిల్లీ లో తిడితే సరిపోద్ది కదా?
-కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుంటె తెలంగాణ ప్రభుత్వం ఆపిందో చెప్పాలని డిమాండ్
-బీజేపీ కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్

హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను సీనియర్‌ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఖండించారు. కేంద్రం ఏ అభివృద్ధి పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందో చెప్పాలని సవాల్‌ చేశారు. తెలంగాణలో 24 గంటల నిరంత ర విద్యుత్‌పై చర్చకు సిద్ధమేనా అని బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఇంకా మంత్రి తలసాని ఏమన్నారంటే…

అఫీషియల్ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరం.తెలంగాణ ఏర్పాటు ను అవమానించిన మోడీ కి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు.వందే భారత్ ను ఎన్ని సార్లు ప్రారంబిస్తారు..నెక్ట్స్ స్టేషన్ స్టేషన్ కు ప్రారంబిస్తరా? కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ దేశానికి మోడల్ గా నిలిచింది.విభజన హామీలు నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ధి ని అడ్డుకుంటుందో బీజేపీ చెప్పాలి.అదానీ కుంభకోణం పై జేపిసి అడిగితే స్పందన లేదు. సింగరేణి పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి జరగకుంటే ఇన్ని జాతీయ అవార్డులు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ లో 24 గంటల కరెంటు పై చర్చకు సిద్దమా? బీజేపీ రెండు కోట్ల ఉధ్యోగాలు ఏవి? నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తాయి..వీటిపై చర్చకు సిద్దమా.. బీజేపీ లో కుటుంబ పార్టీ నేతలు లేరా? హేమంత బిస్వ శర్మ లాంటి వారు ఈడీ, సీబిపై కేసులు ఉన్న వారు బీజేపీ లో ముఖ్యమంత్రుగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ను అవమానించింది బీజేపీ. కరోనా వ్యాక్సిన్ ఇవ్వమని కేంద్రం తెగేసి చెప్పింది. బీబీనగర్ ఏయిమ్స్ బీజేపీ కట్టించిందా ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ గా గెలిచిన కిషన్ రెడ్డి.. ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక్క లక్ష.రూపాయలు అయినా ఖర్చు చేసారా? ఎన్నికలు తప్ప సంక్షేమం అబివృద్ది అంటే బీజేపీ కి తెలియదు.పరివార్ పార్టీ అనడం సరైంది కాదు.. ఈ మాత్రం దానికి హైదరాబాద్ వచ్చి తిట్టాలా..ఢిల్లీ లో తిడితే సరిపోద్ది కదా? ప్రధాని వస్తే సీఎం పోవాలని చట్టం లో లేదు.. ప్రభుత్వ ప్రతినిధి గా నేను వెళ్లా. సీఎం ను కేంద్రమే అవైడ్ చేసింది.సీఎం మనసు కలత చెందింది కాబట్టి వెళ్లడం లేదు.

బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ని పంజరంలో చిలుక అని విమర్శించలేదా ?
మంత్రి శ్రీనివాస్ గౌడ్..ఏమన్నారంటే… కేసీఆర్ తపన అంతా తెలంగాణ అని గతంలో మోడీ అనలేదా? మేము చెప్పినట్లు వినకపోతే మీ సంగతి చూస్తా అని మోడీ బెదిరిస్తున్నారు. కేంద్రం ఇచ్చే అన్ని అవార్డు లలో తెలంగాణ నెంబర్1. బీజేపీ పాలిత రాష్టరాలకు తెలంగాణ కు పోలికే లేదు.. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ని పంజరంలో చిలుక అని విమర్శించలేదా? తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రానికి జాతీయ రహదారులు ఇచ్చారు. తెలంగాణ లో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి పై బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలు, అధికారులు స్టడీ టూర్ కు వస్తున్నారు.గోరంత ఇచ్చి కొండంత చెప్పుకుంటుంన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ ఏమన్నారంటే…
మోడీ అబద్దాలు మాట్లాడారు. వడ్ల కొనుగోలు పై మోడీ ఒక్క మాట మాట్లాడలేదు. కేంద్రం బియ్యం ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదని పచ్చి అబద్ధం చెప్పారు. గత తొమ్మిదేళ్ళలో కేంద్రం ఒక్క రేషన్ కార్డు పెంచలేదు. వడ్లు కొనకుండా నూకలు తినమని అవహేళన చేశారు. మోడీ ది అదానీ కుటుంబం.

LEAVE A RESPONSE