Suryaa.co.in

Telangana

మునుగోడులో వరంగల్ హవా!

-చండూరు లో పాలకుర్తి పవర్!!
-ప్రచారంలో ముందుండి నడిపిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా హవా నడుస్తోంది. చండూరు లో పాలకుర్తి నియోజకవర్గ పవర్ పని చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నేతకు ఒక్కో ప్రాంతాన్ని, గ్రామాలను, మున్సిపాలిటీ వార్డులను కేటాయించారు. 2 లేదా 3 వేల ఓట్లకు ఒక ఇంచార్జీ ని నియమించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కడియం, ఎమ్మెల్యేలకు, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, పార్టీ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. వాళ్లంతా గత నాలుగైదు రోజులుగా వారికి కేటాయించిన ప్రాంతాల్లో మకాం వేశారు. ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వరంగల్ నేతలే కనిపిస్తున్నారు.

మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలి లో ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారారు. ప్రజల పనుల్లో మంత్రి భాగస్వాములు అయ్యారు. ఒక్కో ఓటరు తో మాట్లాడుతూ, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీస్తున్నారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆరెఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, తిరిగి ఆ ఫోటోలను తన అనుచరులతో ప్రజలకు పంపిస్తూ వస్తున్నారు. మంత్రి గారికి అండగా, తోడుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం నుండి వందలాదిగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా చండూరు కు వెళుతూ, మంత్రి ఎర్రబెల్లి తో పాటుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో ప్రచారానికి ఊపు వస్తున్నది. ప్రజల్లో కూడా మంచి చర్చ జరుగుతున్నది. పార్టీ నీ, పార్టీ అభ్యర్థిని, ప్రభుత్వ పతకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో పలు చోట్ల ప్రజలతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో మంత్రి మాట్లాడుతున్నారు. ప్రజలకు ప్రస్తుతం ఎన్నికలు ఎందుకు వచ్చాయి? ఎవరి స్వార్థం కోసం వచ్చాయి? ప్రజల కర్తవ్యం ఏంటి? అనే అంశాలను వారికి అర్థం చేస్తున్నారు.

మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మునుగోడు లో వరంగల్, పాలకుర్తి ల హవా నలుదిశలా వీస్తోంది.

ఓటర్లు మాత్రం కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు

-కొందరు మధ్యల వచ్చి కెళ్లగిస్తాండ్రు. పైసల ఆశ పెడ్తాండ్రు. నమ్మె టోల్లు ఎవరూ లేరు
-మునుగోడు లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాశం శివారెడ్డి సంభాషణ

మాకు కరెంటు బాధ లేకుండా అయింది. పింఛను బాధ లేకుండా అయింది. పంచాయతీలు లేకుండా ఇంటి ముందటికే నీళ్ళు వస్తానయి. మాకు ఏ బాధా లేదు. ఓటర్లు మాత్రం కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు. రేపు ఓట్లు మాత్రం మెజారిటీ గా ఫుల్లు పడతయి. కొందరు మధ్యల వచ్చి కెళ్లగిస్తాండ్రు. పైసల ఆశ పెడ్తాండ్రు. నమ్మె టోల్లు ఎవరూ లేరు. అంటూ మునుగోడు ఉప ఎన్నికలో తనకు బాధ్యతలు అప్పగించిన చండూరు 2, 3 వార్డులలో ప్రచారం లో నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాశం శివారెడ్డి అన్నారు. ఇంకా ఆయన మంత్రి ఎర్రబెల్లి తో సంభాషణ చేస్తూ…. కెసిఆర్ ఏం తక్కువ చేసిండు. ఒకరిద్దరు పిచ్చి పిచ్చిగా ఒంకర టింకర గా మాట్లాడతాండ్రు. జనం ఆలోచన చేసుకోవాలె. తప్పుడు తోవన పోతే వాళ్ళకే ఇబ్బంది అయితది. కెసిఆర్ తప్పేం చేసిండు? తక్కువ పని చేస్తే బాధ పడాలే. మంచి పనులు చేస్తుండు కదా!

LEAVE A RESPONSE