Suryaa.co.in

Andhra Pradesh

పీఆర్సీపై ప్రశ్నించినందుకే కక్షసాధింపులో భాగంగా అశోక్ బాబు అరెస్ట్

– ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు దుర్మార్గం
– అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
– శాసనమండలి పక్షనేత యనమల రామకృష్ణుడు

ఉద్యోగుల పీఆర్సీ తో పాటు జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీసీఐడీ విచారణ. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన సమయంలోనే ఆయనపై అక్రమ కేసు నమోదు చేయడం కుట్రపూరితం కాదా? టైపో గ్రాఫిక్ తప్పిదం వల్లే పొరపాటు జరిగింది. ఇందులో తన తప్పు లేదని అశోక్ బాబు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అంశంపై గత ప్రభుత్వాలు విచారణ జరిపి ఎలాంటి నేరపూరితం లేదని, ఎలాంటి బెనిఫిట్స్ పొందలేని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముగిసిపోయిన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. సొంత మనిషి సూర్యనారాయణను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం రాక్షసత్వం. ఎన్నికల అఫిడవిట్ లోనూ అశోక్ బాబు ఎక్కడా తన విద్యార్హత డిగ్రీ అని చెప్పలేదు. అర్థరాత్రి అరెస్ట్ ల ద్వారా ప్రశ్నించకుండా ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారు. తక్షణమే కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలి. లేనిపక్షంలో జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం.

LEAVE A RESPONSE